మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు | mobile internet services to remain suspended in surat | Sakshi
Sakshi News home page

మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు

Published Sun, Sep 20 2015 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు

మొబైల్ ఇంటర్నెట్ నిలివేత పొడిగింపు

సూరత్: గుజరాత్ లోని సూరత్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధం మరో 24 గంటలు పొడిగించారు. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ ను సూరత్ లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సూరత్ లో 'ఏక్తా ర్యాలీ' నిర్వహించ తలపెట్టిన హార్దిక్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వదంతులను నిలువరించడానికి ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు.  రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement