
సూరత్ : నగరానికి చెందిన ఓ స్వీట్ షాపు వినూత్న ప్రయోగం చేసింది. చాందీ పాద్వో పండుగను పురస్కరించుకుని బంగారం (24 కారెట్ల పైతొడుగు)తో స్వీటును తయారు చేసింది. దానికి ‘గోల్డ్ ఘారీ’ అని పేరు పెట్టింది. శరద్ పూర్ణిమ తర్వాతి రోజైన చాందీ పాద్వో రోజున సాంప్రదాయ వంటకం ‘ఘారీ’ తినటం అక్కడి ప్రజల ఆనవాయితీ. దీంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన రోహన్ అనే స్వీట్ షాపు యజమాని బంగారంతో స్వీటును తయారు చేశాడు. మామూలు ఘారీ కిలో ధర 660-900 రూపాయల వరకు ఉంటే.. కిలో ‘గోల్డ్ ఘారీ’ ధర 9000 రూపాయలు. ( సముద్రంలో మునిగిపోతున్న పక్షిని కాపాడి.. )
దీనిపై రోహన్ మాట్లాడుతూ.. ‘‘ మేము ఈ సంవత్సరమే ‘ గోల్డ్ ఘారీ’ని తయారు చేశాము. ఇది చాలా ఆరోగ్యకరం. బంగారం ఎంతో ఉపయోగకారని మన ఆయుర్వేదమే చెబుతోంది. ఈ స్వీటును మార్కెట్‌లోకి తెచ్చి మూడురోజులవుతోంది. మేము అనుకున్న దానికంటే తక్కువ డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నా’’మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment