IPL 2022: MS Dhoni Other CSK Players Grand Welcome Surat Team Starts Training - Sakshi
Sakshi News home page

IPL 2022: ధోని క్రేజ్‌ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం

Published Tue, Mar 8 2022 9:54 AM | Last Updated on Tue, Mar 8 2022 10:56 AM

MS Dhoni Other CSK Players Grand Welcome Surat Team Starts Training - Sakshi

ధోని నేతృత్వంలోని సీఎస్‌కే ఐపీఎల్ 2022 కోసం సన్నాహాలు ప్రారంభించింది. సోమవారం సూరత్‌లోని లాల్‌బాయి కాంట్రాక్టర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ కోసం సీఎస్‌కే అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ధోని సేనకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. సీఎస్‌కే టీమ్‌ ప్రాక్టీస్‌ కోసం గ్రౌండ్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. కెప్టెన్‌ ధోని బస్‌ నుంచి దిగగానే ధోని.. ధోని అని అరుస్తూ పేపర్ల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని సీఎస్‌కే తన ట్విటర్‌లో రాసుకొచ్చింది. ''మేం ఎక్కడున్నా అదే స్వాగతం. ఆ కళ్లు.. నవ్వు మాకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తున్నాయి.'' అంటూ పేర్కొంది.  

ఐపీఎల్‌ 2022 సన్నాహాలకు భిన్నమైన స్థాయిని అందించడానికి సీఎస్‌కే టీం ఐర్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్‌ను జట్టులో చేర్చుకుంది. 22 ఏళ్ల జోష్‌ లిటిల్‌ చెన్నై జట్టులో నెట్ బౌలర్ పాత్రను పోషించనున్నాడు. గతేడాది సీజన్‌లో అంచనాలకు మించి రాణించిన సీఎస్‌కే నాలుగోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఈ సీజన్‌లో మరోసారి సత్తా చాటేందుకు ధోని తన ప్లాన్స్‌ను సిద్ధం చేస్తున్నాడు. సీఎస్‌కే, కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభం కానుంది.

చదవండి: IPL 2022: డు ప్లెసిస్‌కు భారీ షాక్‌.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్!

Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్‌ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement