IPL 2022: MS Dhoni Massive Sixes in Practice Session Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: ధోనియా మజాకా.. వీడియో వైరల్‌

Published Wed, Mar 9 2022 11:57 AM | Last Updated on Wed, Mar 9 2022 4:50 PM

IPL 2022: CSK Captian MS Dhoni Hits Big Sixes Surat Practice Camp - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా అందరికంటే ముందు సీఎస్‌కే తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూరత్‌ వేదికగా తమ క్యాంప్‌ను ప్రారంభించిన ధోని సేన అందుకు తగ్గట్టుగానే కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వయసు రిత్యా నలబైల్లోకి అడుగుపెట్టిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీఎస్‌కే కూడా ధోనికి టైటిల్‌ అందించి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌ సమయంలో ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ధోని మూడు భారీ సిక్సర్లు సంధించాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, స్ట్రెయిట్‌ సిక్సర్లు ఉన్నాయి. మరి ప్రాక్టీస్‌లో దుమ్మురేపిన ధోని ఐపీఎల్‌లో ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మార్చి 26 నుంచి కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఆరంభం కానుంది. 

ఇక యూఏఈ వేదికగా జరిగిన 2020 ఐపీఎల్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. ఆ యేడు సీఎస్‌కే చెత్త ప్రదర్శనపై అని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అటు ఆటగాడిగా.. కెప్టెన్‌గా ధోని సత్తా తగ్గిపోయిదంటూ చురకలు అంటించారు. కానీ ఇవన్నీ సీఎస్‌కే పట్టించుకోకుండా 2021 సీజన్‌పైనే దృష్టి పెట్టింది. గతేడాది సీజన్‌ సగం మన దేశంలో.. ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా రెండో అంచె పోటీలను యయూఏఈ వేదికగా జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్‌కే.. ఫైనల్లో కేకేఆర్‌ను ఓడించి నాలుగోసారి టైటిల్‌ను గెలిచి సత్తా చాటింది.

చదవండి: ENG vs WI: బంతి అంచనా వేసేలోపే క్లీన్‌బౌల్డ్‌.. షాక్‌ తిన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌

Trolls On Fawad Alam: పాక్‌ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement