ప్రాక్టీసు చేస్తున్న రాజ్‌వర్ధన్ హంగర్కర్(PC: CSK)
IPL 2022- CSK Practice Session: అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్‌వర్ధన్ హంగర్కర్ నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. బ్యాట్, బంతితో ప్రాక్టీసు చేస్తున్నాడు. మిస్టర్ కూల్ ధోని సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆటపై దృష్టి సారించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ రాజ్‌వర్ధన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది.
ఇక ఐపీఎల్-2022 సన్నాహకాల్లో భాగంగా ధోని సారథ్యంలోని సీఎస్‌కే ఇప్పటికే సూరత్ చేరుకుని ప్రాక్టీసు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్‌వర్ధన్ గురువారం ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నాడు. సిక్సర్లు బాదుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన అతడు.. ఫీల్డింగ్ కోచ్ సలహాలతో బంతితోనూ మెరిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ క్రమంలో ..‘‘ ఏయ్.. రాజ్‌వర్ధన్.. అలా కాదు.. ఇలా.. కాస్త చూసుకో! అంటూ ధోని సలహాలు ఇస్తున్నాడు. సరే భయ్యా! అని రాజ్‌వర్థన్ అంటున్నాడు’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మార్చి 26న మ్యాచ్‌తో 15వ సీజన్ ఆరంభం కానుంది. ముంబై వేదికగా అత్యధిక మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో అక్కడి పిచ్‌లను పోలి ఉండే సూరత్ స్టేడియంను సీఎస్‌కే ప్రాక్టీసు కోసం ఎంచుకోవడం విశేషం.
ఇక రాజ్‌వర్ధన్ విషయానికొస్తే అతడు గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్‌తోనూ రాణించగలడు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది బ్యాటింగ్ పదును చూపించాడు. ఈ క్రమంలో చెన్నై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించాడు. స్టార్ ప్లేయర్ దీపక్ చహర్ జట్టుకు దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో రాజ్‌వర్ధన్‌ను అతడికి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది.
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment