నన్నే టార్గెట్ చేస్తున్నారు
విజయాలుంటేనే ఫామ్‌లో ఉండే హీరోయిన్లు కొందరు, అసలు అవకాశాలు లేకపోయినా క్రేజ్‌లో ఉంటారు అతి కొద్దిమంది నాయికలు. ఈ రెండో కోవకు చెందిన నటి నమిత. ఇంతకుముం దు ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన ఈ బ్యూ టీ ఆ మధ్య తెలుగు చిత్రం సింహాతో కూడా అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో స్టెప్స్‌వేసి యువత గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రస్తుతం అవకాశాలు అంతగా లేకపోయినా ఏ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. ఆమెకంత క్రేజ్ మరి. అలాంటి నమితను మీడియా టార్గెట్ చేస్తోందని ఆమె వాదన. ఇటీవల అవకాశాలు తగ్గితే వివాహానికి సిద్ధమని నమిత అన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే సమాజ సేవకు పాటు పడాలనుకుంటున్నానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సూరత్‌లో జరగనున్న ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి నమిత అంగీకరించినట్లు అందుకు ఆమె డాన్స్ రిహార్సిల్స్ కూడా చేసుకున్నట్లు, సూరత్‌కు పయనమయ్యే సమయంలో పారితోషికం తీసుకు రావలసిన మేనేజర్ ఆ డబ్బుతో పరారై నట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ అంశాన్ని నమిత ఖండించింది. తానెలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించలేదని తనపై ప్రచారంలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ఇలా తననే టార్గెట్ చేసి ఇలా అసత్య ప్రచారం ఎవరు? ఎందుకు? చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్లామర్ క్వీన్ నమిత వాపోతున్నారు.