Dance Rehearsals
-
అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక
అల్లు అర్జున్ డ్యాన్స్ అదుర్స్ అని అందరికీ తెలిసిందే. రష్మికా మందన్నా కూడా బాగా డ్యాన్స్ చేయగలరు. అయినప్పటికీ డ్యాన్స్ ఇరగదీసే హీరోకి దీటుగా చేయాలంటే కొంచెం రిహార్సల్స్ అవసరం అనుకున్నారేమో! ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ పని మీదే ఉన్నారు. అల్లు అర్జున్‌తో సై అంటే సై అని డ్యాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘పుష్ప’లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసమే రష్మిక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో రిలీజ్ కానుంది. -
అస్వస్థతకు లోనై విద్యార్థిని మృతి
శామీర్‌పేట్: పాఠశాలలో నిర్వహించే ఓ కార్యక్రమానికి సంబంధించిన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శామీర్‌పేట మండల పరిధిలోని జగన్‌గూడ గ్రామానికి చెందిన ఎర్ర అనిల్, జ్యోతి దంపతుల కుమార్తె అనూన్య(14) మజీద్‌పూర్‌లోని జైన్ హెరిటేజ్ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన అనూన్య ఓ కార్యక్రమానికి సంబంధించి డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో స్కూల్ మేయిన్ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఐఫా రిహార్సల్స్ సందడి
-
రిహార్సల్స్‌లో ప్రయోగ
రిహార్సల్స్ అన్నది ఒకప్పుడు షూటింగ్‌కు ముందుగా జరిగే మంచి విధానం. అదిప్పుడు దాదాపు తెరమరుగవుతున్న పద్ధతి. దర్శకుడు ఆర్.కన్నన్లాంటి అతి కొద్దిమంది తన చిత్ర నటీనటులకు అవసరం అనిపిస్తే రిహార్సల్స్ చేయిస్తుంటారు. ప్రస్తుతం నటి ప్రయోగ మార్టిన్‌తో ఆ దర్శకుడు అలాంటి రిహార్సల్స్ చేయిస్తున్నారు. ఆమెను తన తాజా చిత్రం పోడా ఆండవనే ఎన్పక్కం చిత్రంలో నాయికగా ఎంపిక చేశారు. ప్రయోగ పిశాచు చిత్రంలో చిన్న పాత్రల్లో మెరిసింది. అదే ఆమెనిప్పుడు హీరోయిన్ స్థాయికి చేర్చింది. దీంతో బాధ్యత పెరగడంతో ప్రయోగ నటనలోను, డాన్స్లోను రిహార్సల్స్ చేస్తోందట. దీని గురించి మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈమె తెలుపుతూ కన్నన్ చిత్రంలో నటించే పాత్ర కోసం సంభాషణల ఉచ్ఛరణ, శారీరక భాష తదితర విషయాలు దర్శకుడి సహకారం చాలా హెల్ప్ అవుతోందని చెప్పింది. డాన్స్ విషయంలో నృత్యదర్శకులు కల్యాణ్, బృందాల వద్ద శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. పోడా ఆండవనే ఎన్ పక్కం చిత్రం నగర నేపథ్యంలో సాగే కథ అయినా తన పాత్రలో నటనకు చాలా అవకాశం ఉంటుందంది. ఇది చాలా హోమ్లీ పాత్ర అని అంది. పిశాచు చిత్రంలో చిన్న పాత్ర అయినా చాలా గుర్తింపును తెచ్చిపెట్టిందని, తాజా చిత్రంలో మరింత పేరు తెచ్చుకుంటానని ప్రయోగ అంటోంది. -
నన్నే టార్గెట్ చేస్తున్నారు
విజయాలుంటేనే ఫామ్‌లో ఉండే హీరోయిన్లు కొందరు, అసలు అవకాశాలు లేకపోయినా క్రేజ్‌లో ఉంటారు అతి కొద్దిమంది నాయికలు. ఈ రెండో కోవకు చెందిన నటి నమిత. ఇంతకుముం దు ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన ఈ బ్యూ టీ ఆ మధ్య తెలుగు చిత్రం సింహాతో కూడా అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో స్టెప్స్‌వేసి యువత గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రస్తుతం అవకాశాలు అంతగా లేకపోయినా ఏ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. ఆమెకంత క్రేజ్ మరి. అలాంటి నమితను మీడియా టార్గెట్ చేస్తోందని ఆమె వాదన. ఇటీవల అవకాశాలు తగ్గితే వివాహానికి సిద్ధమని నమిత అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే సమాజ సేవకు పాటు పడాలనుకుంటున్నానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సూరత్‌లో జరగనున్న ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి నమిత అంగీకరించినట్లు అందుకు ఆమె డాన్స్ రిహార్సిల్స్ కూడా చేసుకున్నట్లు, సూరత్‌కు పయనమయ్యే సమయంలో పారితోషికం తీసుకు రావలసిన మేనేజర్ ఆ డబ్బుతో పరారై నట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ అంశాన్ని నమిత ఖండించింది. తానెలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించలేదని తనపై ప్రచారంలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ఇలా తననే టార్గెట్ చేసి ఇలా అసత్య ప్రచారం ఎవరు? ఎందుకు? చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్లామర్ క్వీన్ నమిత వాపోతున్నారు.