అస్వస్థతకు లోనై విద్యార్థిని మృతి | School Student Died In School Programme Practice | Sakshi
Sakshi News home page

అస్వస్థతకు లోనై విద్యార్థిని మృతి

Published Thu, Dec 13 2018 9:30 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

School Student Died In School Programme Practice - Sakshi

అనూన్య మృతదేహం అనూన్య (ఫైల్‌)

శామీర్‌పేట్‌:  పాఠశాలలో నిర్వహించే ఓ కార్యక్రమానికి సంబంధించిన డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శామీర్‌పేట మండల పరిధిలోని జగన్‌గూడ గ్రామానికి  చెందిన ఎర్ర అనిల్, జ్యోతి దంపతుల కుమార్తె అనూన్య(14) మజీద్‌పూర్‌లోని జైన్‌ హెరిటేజ్‌ కార్పొరేట్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతుంది.

బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన అనూన్య ఓ కార్యక్రమానికి సంబంధించి డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తుండగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది.  పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించి  మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో స్కూల్‌ మేయిన్‌ గేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి,  న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement