BDL officers
-
ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం
సంగారెడ్డి జిల్లా: చిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. వివరాలు..పటాన్చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్లో అనిత, వెంగళ హిమసుధలు పక్కపక్క నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి భర్తలు కూడా బీడీఎల్ ఉద్యోగులే. వీరు ఈ నడుమ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ చిట్టీల విషయంలో వివాదం తలెత్తడంతో ఆవేశంలో హిమసుధ, అనిత గొంతు కోసి హత్యచేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాయపడిన మహిళను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై భానూరు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐపీఓకు బీడీఎల్!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా 12–13 శాతం వాటాకు సమానమైన 2.2 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం జారీ చేయనుంది. ఇష్యూ సైజు రూ.1,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. 1970లో ప్రారంభమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్... లకి‡్ష్యత క్షిపణులను, ఇతర రక్షణ ఆయుధాలను తయారు చేస్తోంది. నాలుగో కంపెనీ..: ఒక నెలలో ఐపీఓ పత్రాలను సమర్పించిన నాలుగో ప్రభుత్వ రంగ కంపెని ఇది. ఇప్పటికే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, రైట్స్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ– ఈ మూడు కంపెనీలూ ఐపీఓ అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. -
బీడీఎల్ అధికారులపై గిరిజనుల దాడి
నల్లొండ : నల్గొండలో గిరిజనుల ఆందోళనతో బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. క్షిపణి ప్రయోగ స్థల పరిశోధనకు నారాయణపురం మండలం ఐదు బోనాల తండాకు వచ్చిన బీడీఎల్ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కిరోసిన్ పోశారు. క్షిపణి ప్రయోగానికి స్థలం ఇచ్చేది లేదంటూ అధికారులు వచ్చిన వాహనాలకు ధ్వసం చేసి అద్దాలు పగులగొట్టారు. గిరిజనులు ఒక్కసారిగా రెచ్చిపోవటంతో అధికారులు మిన్నుకుండిపోయారు. అనంతరం చేసేది లేక వెనుదిరిగారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తాము క్షిపణి ప్రయోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తామో.... అధికారులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇక నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. దీనికి స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడానికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు.. ఈప్రాంతంలో రాచకొండ ఫైల్డ్ ఫీరింగ్ రేంజ్ (ఆర్ఎఫ్ఎఫ్ఆర్) ఏర్పాటు నిమిత్తం ఆర్మీకి ఇచ్చేందుకు నిర్ణయించిన 6975.39 హెక్టార్ల అటవీ భూమిలో 5360.11 హెక్టార్ల భూమిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.