న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా 12–13 శాతం వాటాకు సమానమైన 2.2 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రభుత్వం జారీ చేయనుంది. ఇష్యూ సైజు రూ.1,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. 1970లో ప్రారంభమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్... లకి‡్ష్యత క్షిపణులను, ఇతర రక్షణ ఆయుధాలను తయారు చేస్తోంది.
నాలుగో కంపెనీ..: ఒక నెలలో ఐపీఓ పత్రాలను సమర్పించిన నాలుగో ప్రభుత్వ రంగ కంపెని ఇది. ఇప్పటికే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, రైట్స్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ– ఈ మూడు కంపెనీలూ ఐపీఓ అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.
ఐపీఓకు బీడీఎల్!
Published Wed, Jan 24 2018 2:44 AM | Last Updated on Wed, Jan 24 2018 2:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment