వైరల్‌ వీడియో : ఇలాంటి ప్రమాదాన్ని చూశారా! | Friend Clings To Mumbai Man Stuck Beneath Running Train | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 6:06 PM | Last Updated on Wed, Dec 26 2018 6:17 PM

Friend Clings To Mumbai Man Stuck Beneath Running Train - Sakshi

ముంబై :

రైలు పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఎంత సన్నని గ్యాప్‌ ఉంటుందో చూసే ఉంటారు. అంత తక్కువ గ్యాప్‌లో పడితే ఇంకేమైనా ఉందా.. డైరెక్ట్‌గా పైకే. అమిత్‌ కూడా అలానే అనుకున్నాడు. కానీ అదృష్టం కొద్ది క్షేమంగా బయటపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు అమిత్‌ అనే వ్యక్తి ముంబై ఖోపోలీ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి ప్రయత్నించి పట్టు తప్పి కింద పడిపోయాడు. అది కూడా పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న చిన్న సందులో.

ఒకవేళ అప్పుడు గనక అమిత్‌ తల ఎత్తితే రైలు కింద పడి మరణించేవాడు. కానీ అదృష్టం కొద్ది అక్కడే ఉన్న అమిత్‌ స్నేహితుడు అతని చేతిని పట్టుకుని నిల్చున్నాడు. రైలు పూర్తిగా వెళ్లిపోయిన తరువాత అమిత్‌ స్నేహితుడు అతన్ని పైకి లాగాడు. దాంతో హమ్మయ్యా అనుకున్నాడు అమిత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement