రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం! | Let UPSC exam be over, M. Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం!

Published Thu, Aug 7 2014 3:05 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం! - Sakshi

రాత్రికి రాత్రే మార్పులు చేయడం అసాధ్యం!

న్యూఢిల్లీ:యూపీఎస్సీపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనకు ఇక్కడతో ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా యూపీఎస్సీఅర్హత పరీక్ష జరగడానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విన్నవించారు. దీనిపై గురువారం లోక్ సభలో ప్రసంగించిన ఆయన.. ఈ సమస్యకు భవిష్యత్తులో తగిన పరిష్కారం కనుగొనేందుకు యత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 'ఆగస్టు 24 వ తేదీన యూపీఎస్సీ పరీక్ష జరుగనుంది. ఇప్పుడు ఈ వివాదం సరికాదు. ఈ తాజా గందరగోళంతో విద్యార్థులను మరింత ఆందోళనలోకి నెట్టవద్దు.'అని తెలిపారు. 2014లో యూపీఎస్సీ పరీక్షా విధానంపై విద్యార్థులు గళం విప్పారు.  ముంగానే ఈ పరీక్షా విధానం ఖరారైంది. రాత్రికి రాత్రి మార్పులు తీసుకురావడం అసాధ్యం'అంటూ తనదైన శైలిలో వెంకయ్య తెలిపారు.

 

అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే,  ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement