చిరుత బోనులో కోడి దొంగ! | Viral Video: Man Stuck In Cage Meant For Leopard At Uttar Pradesh | Sakshi
Sakshi News home page

వీడియో: చిరుత కోసం ఉంచిన బోనులో.. చిక్కిన కోళ్ల దొంగ!

Published Fri, Feb 24 2023 9:16 PM | Last Updated on Fri, Feb 24 2023 9:38 PM

Viral Video: Man Stuck In Cage Meant For Leopard At Uttar Pradesh - Sakshi

చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో.. గాలానికి పడ్డదాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదొక మనిషి. తనను బయటకు తీయండి మహాప్రభో అంటూ బోను తలుపులను పట్టుకుని.. అధికారులను అతను వేడుకోవడం ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌ జిల్లాలోని బసెందువా గ్రామంలో చిరుత సంచారం గురించి అధికారులు సమాచారం అందుకున్నారు. దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా.. ఓ కోడిని అందులో ఉంచారు. అయితే ఆ కోడి కోసం వెళ్లి.. ఆ వ్యక్తి బోనులో చిక్కుకున్నాడు.  

దొంగతనగా కోడిని బోనులోంచి తీసేందుకు యత్నిస్తుండగా.. ఒక్కసారిగా బోను తలుపు పడిపోయింది. దీంతో బయటకు తీయాలని అధికారులను వేడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement