
రేకుల మధ్య చిక్కుకున్న నిందితుడు
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుఖ్‌జిత్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు.
చంద్రశేఖర్‌కాలనీ (నిజామాబాద్): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుఖ్‌జిత్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో చోరీ చేయడానికి ఓ వ్యక్తి గోడపై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నించాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆలయం రేకుల మధ్య ఇరుక్కుపోయాడు. రేకుల మధ్య ఉన్న నిందితుడిని చూసి పక్కన ఉన్న కొందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని బయటకు తీశారు. అనంతరం నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. అతడిని ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన రఘుగా గుర్తించామన్నారు. రఘుపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు ఉందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..?
Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ!