
ఈ రోజుల్లో సాటి మనుషులపై, జంతువులపై దయ, ప్రేమ చూపేవారు చాలా అరుదైపోయారు. ఆపదలో ఉన్న జంతువులను, మనుషులను కనీసం పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇతరులకు తోచిన సహాయం చేస్తూ కనిపించినప్పుడు జనం ఆ వ్యక్తిని అమితంగా గౌరవిస్తారు.
ఇతరుల మీద దయ, ప్రేమలను ఎవరైనా చూపిస్తే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుక్కను కాపాడుతూ కనిపించాడు. ‘ఎక్స్’లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
రోడ్డు పక్కన భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్లను చేరుకునేందుకు ఆ వ్యక్తి ట్రాఫిక్‌ను ఎంతో ధైర్యంగా దాటాడు. ఆ కుక్కకు ప్రేమతో కూడిన స్పర్శను అందించాడు. ఈ అద్భుతమైన క్లిప్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 43 వేలకు మించిన వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియో మూగజీవాలపై చూపాల్సిన సానుభూతి గురించి తెలియజేస్తుంది.
ఇది కూడా చదవండి: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది?
An angel saving another angel
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 1, 2023
This kind soul spotted an abandoned puppy on a busy freeway and rushed to save him from a certain injury or worse.
The herododges traffic and approaches the dog gently to gain his trust, petting him sweetly.
pic.twitter.com/MtmxPQ8f77
Comments
Please login to add a commentAdd a comment