![Student Arm Stuck With The Iron Rod - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/8/Arm-Stuck-Iron-Rod.gif.webp?itok=us-sM2Cs)
ఇనుప రాడ్డులోకి దిగిపోయిన వెంకట్ నిఖిల్ చేయి
పిడుగురాళ్ల (గురజాల): వాకింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థి గేటు దూకబోయి.. అందులో చేయి ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొపావత్ వెంకట్ నిఖిల్ నాయక్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం వాకింగ్ కోసం స్థానిక మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో గేటు దూకి లోపలికి వెళదామని ప్రయత్నించే క్రమంలో కాలు జారి గేటు పైనున్న ఇనుప కడ్డీలోకి ఎడమ చేయి పూర్తిగా చొచ్చుకునిపోయింది. (చదవండి: విషాదం.. వివాహమైన 28 రోజులకే..)
కడ్డీలో నుంచి చేయి తీయాలని ప్రయతి్నంచినా రాలేదు. స్థానికుల సమాచారం మేరకు పల్నాడు ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సుమారు గంటన్నర సమయం వెచ్చించి ఇనుప రాడ్డులో నుంచి చేయిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, వైద్యులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment