బేగంపేటలో లిఫ్ట్ లో ఇరుక్కున్న కేటీఆర్! | telangana-minister-ktr-stucked-in-lift | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 7 2014 8:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM

తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లు ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ లిఫ్ట్ లో కిందికి దిగుతుండగా మూడవ ఫ్లోర్ లోని లిఫ్ట్ స్తంభించింది. దాంతో వరుణ్ మోటార్స్ సిబ్బంది, కేటీఆర్ అంగరక్షకులు ఆందోళనకు లోనయ్యారు. సుమారు 5 నిమిషాలపాటు కేటీఆర్, బాల్క సుమన్ తోపాటు మరికొంతమంది లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సిబ్బంది లిఫ్ట్ బాగు చేసి మూడవ ఫ్లోర్ లోకి పంపించారు. ఆతర్వాత మూడవ ఫ్లోర్ నుంచి ఆయన అంగరక్షకులు క్షేమంగా కిందకి తీసుకురావడంతో వరుణ్ మోటార్స్ నిర్వాహకులు, ఇతర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ మోటార్స్ కంపెనీలో ఓ కొత్త కారును కేటీఆర్ ఆవిష్కరించినట్టు సమాచారం

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement