గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్‌ఈ సుబ్బారావు
పార్వతీపురం: రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్‌ఈ ఎ.వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్లు చొప్పున 8 పాఠశాలలకు రూ.84 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పనులకు పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలో అది పరిష్కరించబడుతుందన్నారు. అనంతరం రీ-టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింద ని తెలిపారు. అలాగే ఆశ్రమ పాఠశాలలకు కొత్తభవనాలు, మరమ్మత్తులు చేపడతామన్నారు.
ఇటీవల బాసంగి పనుల రాద్ధాంతంపై విలేకరులు ప్రశ్నించగా.. నిర్వాసిత బాసంగిలో 36 పనులకు గాను ఇప్పటికీ ఓ మహిళా సంఘానికి 3 పనులు కేటాయించామన్నారు. మిగతా 33 పనులు వీటీడీఏలు, అక్కడ ఇంకా ఏమైనా మహిళా సంఘాలుంటే వాటికి ఆ పనులు అప్పగిస్తామన్నారు. అలాగే ఎస్‌డీఎఫ్‌లో భాగంగా రూ.18 కోట్లతో ఐటీడీఏ పరిధిలో రోడ్లు నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందామని, వాటికితోడు ఉపాధిలో రూ.85కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌కు అనుమతులు కోరామన్నారు.
ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు!
Published Tue, Feb 16 2016 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
Advertisement
Advertisement