Ekalavya schools
-
అడవి బిడ్డలకూ పథకాలు అందాలి
అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు సైతం అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదీవాసీల (పీవీటీజీల) సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు పీవీటీజీ గిరిజనులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం కిసాన్, ప్రధాని ఉజ్వల్ యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అటవీ హక్కు పత్రాల పంపిణీ, జన్‌ధన్ ఖాతాలు, వన్‌దన్ వికాస్ కేంద్రాలు, పీఎం జల్ జీవన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం నిధుల విడుదల సందర్భంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదీవాసీ గిరిజనులతో ప్రధాని వర్చువల్ సమావేశం ద్వారా ముచ్చటించారు. పీవీటీజీ మహిళ: నాపేరు స్వాభి గంగ, మాది గద్యగుడ గ్రామం, అరకులోయ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా భర్త పేరు స్వాభి రామచందర్. మాకు ఇద్దరు పిల్లలు.పీఎం: పీఎం జన్మన్ గురించి మీకు ఎలా తెలిసింది? స్వాభి గంగా: జనవరి 5న మా గ్రామంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన మంత్రి జన్మన్ పథకం గురించి వివరించారు. పీఎం: జన్మన్ అవగాహన సదస్సుతో మీరు ఎలాంటి లబ్ధి పొందారు? స్వాభి గంగా: అవగాహన సదస్సు ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి కోసం, పీఎం జలçజీవన్ యోజన కింద కుళాయి కోసం, పీఎం జన ఆరోగ్య కింద నా కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నా. నాకు పథకాలన్నీ మంజూరు చేశారు. పీఎం: మీ జీవనాధారం ఏమిటి? స్వాభి గంగా: ఆర్వోఎఫ్ఆర్ పథకంలో నాకు 35 సెంట్లు భూమికి పట్టా వచ్చింది. అందులో కాఫీ, మిరియాలు సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నాం. పీఎం: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది? స్వాభి గంగా: చాలా ఆనందంగా ఉంది. గతంలో దళారులకు విక్రయించి మోసపోయేవాళ్లం. ఇప్పుడు మంచి ధర లభిస్తోంది. కొండరెడ్డి గిరిజనులతో ముఖాముఖి పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం కొండరెడ్డి గిరిజనులతో మాట్లాడారు. పీఎం జనజాతి, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కార్యక్రమం అమలులో భాగంగా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమం వల్ల పీవీటీజీ గ్రామాల్లో రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. -
వారికి గుడ్ న్యూస్ 38 వేల ఉద్యోగాలు, గిరిజనులకు ప్రత్యేక మిషన్
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ అందించారు. బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించిన నిర్మలా సీతారామన్ విద్యకు తమ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు. ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయనున్నారు. రానున్న మూడేళ్లలో ఈ స్కూళ్లకు 38, 800 వేల మంది టీచర్లను,ఇత సహాయక సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనుల పీవీటీజీ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు. గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ డెవలప్మెంట్ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న 3 సంవత్సరాలలో ఈ పథకం అమలుకు రూ. 15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సత్తా చాటిన గిరి పుత్రులు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్–2022 ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్ జయకేతనం ఎగురవేసింది. కోవిడ్‌తో వాయిదా పడిన మూడవ జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఈ నెల 17 నుంచి గురువారం (22వ తేదీ) వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4,328 మంది గిరిజన విద్యార్థులు పోటీ పడ్డారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని లయోలా కాలేజీ, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, సీహెచ్‌కేఆర్ ఇండోర్ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్ వద్ద మొత్తం 22 రకాల క్రీడలు, ఆటల పోటీలను ఆరు రోజులపాటు నిర్వహించారు. 15 రకాల క్రీడల్లో రాష్ట్రానికి చెందిన బాలుర జట్లు 5 విభాగాల్లోను, బాలికల జట్లు 8 విభాగాల్లోను జయకేతనం ఎగురవేసి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించాయి. మొత్తం 7 క్రీడల్లో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ అత్యధిక పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చివరివరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఇచ్చిన తెలంగాణ రన్నర్‌గా నిలిచింది. కాగా, 7 ఆటల విభాగాల్లో అండర్–19లో బాలురు హ్యాండ్‌బాల్, వాలీబాల్‌లోను, బాలికల జట్టు ఖోఖో విభాగంలోను చాంపియన్‌గా నిలవడం గమనార్హం. మొత్తానికి రాష్ట్రం నుంచి బాలుర కంటే బాలికలే బాగా రాణించడం విశేషం. -
గుంటూరు: జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్నారు ( ఫొటోలు )
-
సత్తా చాటిన ఆంధ్రా అథ్లెట్లు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడా పోటీల్లో సోమవారం ఆంధ్రా విద్యార్థులు అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. విజయవాడ లయోలా కాలేజీ, గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ మైదానాలలో గిరిజన బాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. రన్నింగ్, బాడ్మింటన్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రెండవ రోజు క్రీడల్లో ఆంధ్రాతోపాటు తెలంగాణ క్రీడాకారులు రాణించారు. ముఖ్యంగా మెడల్స్ జాబితాలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటివరకు తెలంగాణ క్రీడాకారులు వివిధ విభాగాల్లో 27 పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో 14 స్వర్ణం, 4 రజతం, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 11 పతకాలు దక్కించుకుంది. వీటిలో 2 స్వర్ణాలు, 5 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్ మెడల్స్ జాబితాలో గుజరాత్ 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌కు 6 స్వర్ణం, 3 రజతం, 11 కాంస్య పతకాలున్నాయి. నాగార్జున మైదానంలో.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగిన అథ్లెటిక్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్–19 బాలికల ట్రిపుల్ జంప్‌లో 9.90 మీటర్లతో రాష్ట్రానికి చెందిన డి.శ్రీజ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 9.55 మీటర్లతో తెలంగాణకు చెందిన బొంత స్నేహ రెండో స్థానం, 9.30 మీటర్లతో మూడో స్థానంలో ఏపీకి చెందిన శ్రీవల్లి నిలిచింది. అండర్–14 బాలుర విభాగంలో డిస్కస్ త్రోలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 29.79 మీటర్లతో మొదటి స్థానాన్ని మన రాష్ట్రానికి చెందిన బోయ మహేంద్ర దక్కించుకోగా.. 25.99 మీటర్లతో రెండో స్థానంలో ఏపీకి చెందిన వి.సుశాంత్‌రెడ్డి, 24.53 మీటర్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేశ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. అండర్–19 హై జంప్ బాలుర కేటగిరీలో 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన ఎం.రంజిత్ మొదటి స్థానం, 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన హెచ్.దీపక్ కుమార్ రెండో స్థానం, 1.61 మీటర్లతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కె.అనిష్ మూడో స్థానం దక్కించుకున్నారు. అండర్–19 800 మీటర్ల రన్నింగ్ బాలుర విభాగంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్ కొవచి 2.05.90 సమయంలో లక్ష్యం చేరి తొలి స్థానంలోను, 2.08.80 సమయంలో లక్ష్యం చేరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రంజిత్ కుమార్ రెండో స్థానంలోను, 2.12.30 సమయంలో లక్ష్యం చేరి జార్ఖండ్‌కు చెందిన అలోక్ మూడో స్థానంలో నిలిచారు. లయోలా క్రీడా మైదానంలో.. విజయవాడ లయోలా క్రీడా మైదానంలో తైక్వాండో అండర్–14 పోటీలు ఆద్యంతం ఉత్సహభరితంగా సాగాయి. 21:23 వెయిట్ బాలుర కేటగిరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన చౌదరి స్మిత్కుమార్పై మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ టెకం విజయం సాధించారు. 23:25 వెయిట్ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్రకు చెందిన రితేష్రాజు వడావ్పై మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష మేరవి విజయం సాధించారు. బాడ్మింటన్ అండర్–19 కేటగిరీ 52–56 కేజీలలో హిమాచల్‌ప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. అండర్–19 కేటగిరీ 57–60 కేజీల విభాగంలో మధ్యప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. హాకీ బాలుర 7వ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్–కర్ణాటక మ్యాచ్‌లో 1–0 తేడాతో ఆంధ్రప్రదేశ్ గెలిచింది. జూడో (బాలికలు) అండర్–14 కేటగిరీ ఫ్రీస్టయిల్ 39, 42, 46 విభాగాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ బాలికలు విజయం సాధించారు. వాలీబాల్ పోటీల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌పై ఏపీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. -
జిమ్నాస్టిక్స్‌లో ఏపీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలికల ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు. జిమ్నాస్టిక్స్ అండర్–19 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్) స్వర్ణం, డి.దేవ్ (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు. కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్–బి రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్థాన్ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్–19) పూల్‌లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్–19) పూల్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన ఆయూష్ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా నిలిచారు. 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది. 226 పాయింట్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, అయూష్ చర్పొట, రంజిత్, సునీల్ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్‌గఢ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
ఆకాశమే హద్దుగా ప్రతిభ చాటండి
సాక్షి, అమరావతి: కృష్ణానది ఒడ్డున, దుర్గా మాత ఒడిలో గిరిజన బాలల జాతీయ క్రీడోత్సవాలు జరగడం పెద్ద సంబరమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుట చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతిలో భాగమని, ఆకాశమే హద్దుగా ఆటలాడి ప్రతిభ చాటాలని, ప్రఖ్యాత క్రీడాకారులుగా రాణించాలని చెప్పారు. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రేణుకా సింగ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్రీడా జ్యోతిని వెలిగించి జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నేటి కాలంలో ఏకలవ్యుడి వంటి శిష్యులు ఎంతో మంది ఉన్నారని, మరెందరో ద్రోణాచార్యులు కూడా ఉన్నారని అన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి రేణుకా సింగ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మన రాష్ట్రంలో జరగడం గర్వకారణం గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో జరగడం గర్వించే విషయమని పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజనులంటే సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో ప్రేమ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమన్నారు. గిరిజన బాలలను విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడానికి ఐదు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరు పథకాల ద్వారా గిరిజన విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 1.26 లక్షల గిరిజన కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 2,48,887 ఎకరాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే వి.కళావతి, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4344 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఏపీ గిరిజన బాలలతో ‘ధింసా’ నృత్యం కాగా ఏపీకి చెందిన గిరిజన బాలలు ప్రదర్శించిన ధింసా, లంబాడీ నృత్యాలు, తెలంగాణ బాలల గుస్సాడీ నృత్యం అందరినీ అలరించాయి. క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు దేశంలోని 22 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం పంపిన సందేశాన్ని డిప్యూటీ సీఎం రాజన్న దొర చదివి వినిపించారు. ‘స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా జీవించే గిరిజనులంతా నా కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నతికి, అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తోంది. నవరత్నాల ద్వారా వారి అభివృద్ధి కాంక్షిస్తోంది. క్రీడాకారులకు, కోచ్‌లకు, అధికారులకు, ఈఎంఆర్ఐ స్కూల్స్ సిబ్బందికి నా శుభాభినందనలు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అట్టహసంగా ప్రారంభమైన ఏకలవ్య ఆదర్శ పాఠశాలల నేషనల్ స్పోర్ట్స్ మీట్
సాక్షి, విజయవాడ: ఏకలవ్య ఆదర్శ పాఠశాలల మూడవ జాతీయ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం శనివారం అట్టహసంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్ధినులు నృత్యాలు చేశారు. కాగా ఈనెల 17 వ తేదీ నుంచి 22 వ తేది వరకు నాగార్జున యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో క్రీడలు జరగనున్నాయి. -
Andhra Pradesh: గిరి బాలల ఆటల సంబరం
సాక్షి, అమరావతి: గిరి బాలల ఆటల పోటీలకు రాష్ట్రం సిద్ధమైంది. శనివారం గిరిజన విద్యార్థుల క్రీడా సంబరం ప్రారంభమవుతోంది. ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడో జాతీయ క్రీడలు–2022కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 22 వరకు నిర్వహిస్తున్న ఈ క్రీడల ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర శుక్రవారం సమీక్షించారు. జాతీయ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలకు 22 రాష్ట్రాల నుంచి దాదాపు 4,328 మంది విద్యార్థులు విజయవాడకు తరలివచ్చారు. ఈ పోటీలు విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతాయి. ప్రారంభ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరుగుతాయి. ఈ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుట హాజరై సాయంత్రం 5 గంటలకు స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి రాజన్నదొరతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మస్కట్‌గా కృష్ణ జింక.. ‘ఏక్తా’గా నామకరణం ఈ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను మస్కట్‌గా ఎంపిక చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ప్రతిబింబించేలా మస్కట్‌కు ‘‘ఏక్తా’’గా నామకరణం చేశారు. ్రప్రతి రోజూ 7 వేల మందికి భోజనాలు అందించేలా ప్రత్యేక బృందాన్ని నియమించారు. క్రీడాకారులను వేదికలకు తరలించేందుకు దాదాపు 50 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పోటీలు ఇలా.. ఈనెల 18 నుంచి 21 వరకు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, సీహెచ్‌కేఆర్ ఇండోర్ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్‌లో క్రీడా పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత, 7 టీమ్ ఈవెంట్స్ ఉంటాయి. అండర్–14, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా ఈవెంట్లు ఉంటాయి. -
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, పాడేరు: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో బాలబాలికలకు కో ఎడ్యుకేషన్ పద్ధతితో విద్యాబోధన ఉంటుందని ఆయన వివరించారు. ప్రతి తరగతికి 60 సీట్లు చొప్పున బాలికలకు 30, బాలురకు 30 కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కొయ్యూరులో 7వ తరగతిలో బాలురకు మూడు సీట్లు, బాలికలకు మూడు సీట్లు ఖాళీలున్నాయని, పాడేరులో 7వ తరగతిలో బాలురకు ఆరు సీట్లు ఖాళీలున్నాయన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణకు దగ్గరలోని గురుకుల పాఠశాల/కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022–23 విద్యాసంవత్సరానికి గాను ప్రతిభ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిభ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను అమలు చేస్తుందన్నారు. విశాఖలోని మారికవలస ప్రతిభ పాఠశాలలో 8వ తరగతిలో బాలికలకు 45 సీట్లు, విజయనగరం జిల్లా జోగంపేట ప్రతిభ పాఠశాలలో 8వ తరగతి(బాలురు)కు 45సీట్లు కేటాయించారన్నారు. అలాగే ప్రతిభా కళాశాలల్లో సీవోఈ, ఎస్‌వోఈ విభాగాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. మారికవలసలో బాలికలు, జోగంపేటలో బాలురు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, కేవలం గిరిజన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. 8వ తరగతి ప్రవేశాలకు గాను ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు వచ్చేనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశపరీక్షను పాడేరు గురుకుల పాఠశాల, అరకులోయ గురుకుల కళాశాలల్లో మే 29న నిర్వహిస్తామని పీవో వెల్లడించారు. (చదవండి: మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్) -
AP: గురి తప్పని చదువులకు.. ఏకలవ్య
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఒక్క చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు వేసింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కూడా అందిపుచ్చుకుంటూ గిరిజనుల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఏకలవ్య స్కూళ్ల ద్వారా ప్రతి విద్యార్థిని చదువుల్లో గురి తప్పని ఏకలవ్యులుగా తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు మేలైన ఫలితాలు సాధిస్తుండగా ఏకలవ్య పాఠశాలలు మరింతగా ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉండగా కొత్తగా మరో 9 మంజూరయ్యాయి. 2021–2022 విద్యా సంవత్సరానికి మంజూరైన వీటిని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతలు ఇవే.. ►సీబీఎస్ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏకలవ్య మోడల్ స్కూళ్లు ఉంటాయి. మొదటి ఏడాది ఆరో తరగతితో ప్రారంభించి ఆ తర్వాత ఏడాదికొక తరగతి చొప్పున 12వ తరగతి వరకు పెంచుతారు. ►ప్రతి తరగతికి 60 మంది (బాలలు 30, బాలికలు 30 మంది) ఉంటారు. 11, 12 తరగతుల్లో 90 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. ►ఒక్కో పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల స్థలంలో నిర్మిస్తుంది. ►విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం ఇలా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 8 బాలబాలికల కోసం వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల ఉంటాయి. 8 ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు ద్వారా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. వేగంగా ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు వేగంగా సాగుతోంది. కేంద్రం కొత్తగా రాష్ట్రానికి 9 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వీటి నిర్మాణం వేగంగా సాగేలా ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు 15 నుంచి 20 ఎకరాల చొప్పున ఉచితంగా భూమిని కేటాయించింది. వీటికి ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.1.09 లక్షలు చొప్పున కేటాయిస్తుంది. కాగా ఏకలవ్య పాఠశాలలకు ఉచితంగా భూమి కేటాయింపు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం వంటివి రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తోంది. తద్వారా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తోంది. – కె.శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ -
ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అరకులోయ మండలం గన్నెల రోడ్డులోని మజ్జివలస, పెదబయలు, జి.మాడుగుల మండల కేంద్రాల్లో మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మూడు చోట్లా నిర్మించనున్న పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించింది. ఒక్కో పాఠశాలను 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ ఆదివారం మజ్జివలసలో పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. -
ఏపీకి 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లు మంజూరు: కేంద్రం
-
ఏపీకి 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లు మంజూరు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరైనట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 28 ఏకలవ్య స్కూళ్లలో 11 విశాఖపట్నం జిల్లాలోను 6 తూర్పు గోదావరి జిల్లాలోను ఉన్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఏకలవ్య సూళ్లలో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుని సహకరించడానికి వీలుగా 2019లో గిరిజన విద్యార్థుల జాతీయ విద్యా సంఘాన్ని (ఎన్ఈఎస్టీఎస్)ను నెలకొల్పినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థను నెలకొల్పిన తొలి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య స్కూళ్లలో 92 శాతం మంది టెన్త్ విద్యార్థులు, 88 శాతం మంది ఇంటర్ విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 13 మంది ఇంజనీరింగ్ కోర్సుల్లోను, 11 మంది మెడికల్ కోర్సుల్లోను 21 మంది ఇతర ప్రొఫెనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో విద్యార్ధులు జేఈఈ, నీట్లో కూడా రాణించేందుకు వీలుగా దక్షణ ఫౌండేషన్ ద్వారా ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. -
టెట్ అభ్యర్థులకు తీపి కబురు... ఆ పోస్టులకు అర్హులే!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (ఈఎం ఆర్ఎస్) ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 3,400 పోస్టుల భర్తీకి ఈ నోటి ఫికేషన్‌ను జారీ చేయగా, అందులో తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 262 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో 168 టీజీటీ పోస్టులు ఉండగా, ఆయా పోస్టు లకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో (సీటెట్) అర్హత సాధించిన వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, టెట్‌లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే 11 ప్రిన్సిపాల్ పోస్టులు, 6 వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు, 77 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతల వివరాలను తమ వెబ్సైట్లో (https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/Page/Page?PageId=5)పొందొచ్చని వివరించింది. మెుత్తంగా రాష్ట్రంలోని 262 పోస్టుల భర్తీకి గురువారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిన ఎన్టీఏ.. అభ్యర్థులు ఈనెల 30 వరకు nhttps://recruitment.nta.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్లైన్ పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని తెలిపింది. -
కొత్తగా 9 ఏకలవ్య మోడల్ గురుకులాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (ఈఎంఆర్ఎస్) స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కూళ్లు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకుల స్కూళ్లు కో–ఎడ్యుకేషన్‌లో పనిచేస్తాయి. కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లకు నిధులు కొత్తగా మంజూరైన ఈఎంఆర్ఎస్లను విశాఖజిల్లాలోని పెదబయలు, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, కొయ్యూరు, అరకు, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరంలలో ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణాలకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో స్కూల్ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. కనీసం 15 నుంచి 20 ఎకరాల్లో గురుకులం నిర్మిస్తారు. భవన నిర్మాణాలకు నిధులనూ ప్రభుత్వం మంజూరు చేసింది. క్రమేణా జూనియర్ కాలేజీలు.. ప్రస్తుతం ఉన్న 19 ఈఎంఆర్‌ఎస్‌ల్లో 3,603 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇవి ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. మొదట, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 6వ తరగతిలో మాత్రమే విద్యార్థులను చేర్చుకుంటారు. మొదట చేరిన విద్యార్థులు పై క్లాసులకు వెళుతుంటారు. రెండు సెక్షన్లు ఏర్పాటు చేసి ఒక్కో సెక్షన్‌కు 30 మంది చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటారు. 2014లో ప్రారంభమైన నాలుగు స్కూళ్లు ప్రస్తుతం జూనియర్ కాలేజీలుగా మారాయి. మిగిలిన 15 స్కూళ్లు ప్రస్తుతం 9వ తరగతి వరకు నడుస్తున్నాయి. బాలుర స్కూలులో 547 మంది, మూడు బాలికల స్కూళ్లలో 1,419 మంది, 15 కో–ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,637 మంది విద్యార్థులు చదువుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకం ఈ స్కూళ్లలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకాలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎంపిక ఉంటుంది. నిర్వహణ బాధ్యతలు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చూస్తుంది. కాగా, కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ వంతమైన విద్యకు ఈఎంఆర్ఎస్ ఈఎంఆర్‌ఎస్‌ల్లో ఆదర్శవంతమైన విద్యను అందిస్తున్నాం. రాష్ట్రానికి కొత్తగా మరో తొమ్మిది స్కూళ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రెండింటి నిర్మాణాలకు ప్రభుత్వం స్థల సేకరణ పూర్తి చేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థలాల పరిశీలన జరుగుతోంది. – ఎస్. లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. -
కొత్తగా ఎనిమిది ‘ఏకలవ్య’ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 8 ఏకలవ్య మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగిరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 8 స్కూళ్లు నిర్వహిస్తుండగా.. మరో 8 స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఈఎంఆర్ స్కూళ్లకు శాశ్వత భవనాలున్నప్పటికీ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఈఎంఆర్ఎస్ల కోసం ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసిన క్రమంలో రాష్ట్రంలోని ఈఎంఆర్‌ఎస్‌లకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర గిరిజన శాఖ కేంద్రానికి నివేదించింది. సీబీఎస్ఈ అనుమతితో: ఇప్పటికే ఉన్న 8 ఈఎంఆర్‌ఎస్‌లకు సీబీఎస్ఈ అనుమతులు వచ్చేశాయి. తాజాగా మరో 8 స్కూళ్లను ప్రారంభించాలని ఆ శాఖ నిర్ణయించడంతో వాటికి సీబీఎస్ఈ అనుమతులకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీటికి కూడా అనుమతులు ఇస్తున్నట్లు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది. ఈఎంఆర్ఎస్ల నిర్వహణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే ఒక్కో ఈఎంఆర్ఎస్కు రూ.20 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు. వచ్చే ఏడాది సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభమయ్యే స్కూళ్లు.. సీరోల్, మరిమడ్ల, గాంధారి, ఎల్లారెడ్డిపేట్, కురవి, బాలానగర్, ఇంద్రవెల్లి, గండుగులపల్లి. -
ఈఎంఆర్‌లకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ స్కూళ్ల (ఈఎంఆర్)కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఈ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ.. త్వరలో పూర్తిగా కేంద్రం అధీనంలో పనిచేయనున్నాయి. ఇందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సొసైటీ తరహాలో ఈఎంఆర్ సొసైటీని అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా ఉన్న పాఠశాలలు, వాటి అవసరాలు, ఖాళీలు, పోస్టుల భర్తీ తదితర పూర్తి సమాచారాన్ని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వీలైనంత త్వరగా వివరాలు పంపిస్తే సొసైటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఈఎంఆర్ పాఠశాలలున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈఎంఆర్ నేషనల్ స్పోర్ట్స్ మీట్‌కు హైదరాబాద్ వేదికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూవల్ ఓరమ్ తెలంగాణకు కొత్తగా ఐదు స్కూళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తేవాలని, ఆలోపు అనుమతులన్నీ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రాథమిక అనుమతులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. సీబీఎస్ఈ సిలబస్.. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ పాఠశాలల్లో చాలావరకు స్థానిక భాషకు అనుగుణంగా బోధన సాగుతోంది. వీటిని జాతీయ స్థాయి సొసైటీకి అనుసంధానిస్తే.. అన్ని పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి. దీంతో అన్నింట్లో ఇంగ్లిష్ మీడియం బోధన నిర్వహించనున్నారు. అదేవిధంగా సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తారు. కేవీ, నవోదయ పాఠశాలలకు ధీటుగా వీటిని బలోపేతం చేస్తారు. దీనికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. అదేవిధంగా ఈ పాఠశాలల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, జీతభత్యాల చెల్లింపులు తదితర ప్రక్రియంతా కూడా సొసైటీ అధీనంలో జరుగుతుంది. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 5 ఈఎంఆర్‌లకు గిరిజన మంత్రిత్వ శాఖ నిధులు ఇవ్వనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఈఎంఆర్‌కు గరిష్టంగా రూ.25 కోట్లు చొప్పున ఐదింటికి రూ.125 కోట్ల వరకు మంజూరు చేసే అవకాశముందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా మంజూరైన ఈఎంఆర్‌లకు నిధులు విడుదలైన వెంటనే చర్యలు చేపడతారు. -
కొత్తగా మరో గురుకుల సొసైటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో గురుకుల సొసైటీ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు 5 సంక్షేమ శాఖల పరిధిలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, గిరిజనులకు టీటీడబ్ల్యూఆర్‌ఈఐ ఎస్, బీసీలకు ఎంజేపీటీఎస్‌బీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, మైనారిటీలకు ఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్, విద్యాశాఖ పరిధిలో టీఎస్‌ఆర్‌ఈఐఎస్ పేరుతో గురుకుల విద్యాలయ సొసైటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల సొసైటీ పేరుతో ఏర్పాటు కానుంది. ఈ సొసైటీకి నిధులు, విధులన్నీ కేంద్రమే నిర్వహించనుంది. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. సులభంగా నిధుల వినియోగం.. ఈఎంఆర్‌ఎస్‌లకు నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటిని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయడంతో అక్కడి నుంచి అవసరాలను బట్టి నిధు లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు నేరుగా కాకుండా ప్రత్యేక పద్దుల ద్వారా ఖర్చు కావడంతో ప్రాధాన్యాంశాలు, అత్యవర కేటగిరీల్లో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా గురుకుల సొసైటీ ఏర్పాటు చేస్తే నిధులను నేరుగా విడుదల చేయడం సులభతరం కానుంది. గురువారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో సొసైటీ ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా మరో 13 ఈఎంఆర్ఎస్లు రాష్ట్రంలో 11 ఈఎంఆర్ఎస్లు ఉన్నాయి. ఇవన్నీ గిరిజన మండలాల్లోనే ఉన్నాయి. తాజాగా మరో 13 ఈఎంఆర్ఎస్లను మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఏకలవ్య.. వసతులేవయ్యా..!
పార్వతీపురం: ఏకలవ్య పాఠశాలలంటే ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండేవి. ఇందులో సీటు కావాలంటే ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి సిఫార్సులు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 2017లో కేంద్రప్రభుత్వం ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకోసం ఒక్కోదానికి రూ.12 కోట్ల చొప్పున రాష్ట్రంలో పది పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు అన్ని జిల్లాల్లోనూ తాత్కాలిక భవనాల్లో హడావుడిగా వీటిని ప్రారంభించారు. అప్పట్లో ఆరో తరగతి ప్రవేశానికి విద్యార్థులు లేకపోవడంతో గురుకులాల నుంచి కొందరిని, గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి కొందరిని తెచ్చి వీటిలో ప్రవేశాలు కల్పించారు. ఉద్యోగుల క్వార్టర్లలో తరగతులు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కురుపాంనకు ఒక ఏకలవ్య పాఠశాల మంజూరైంది. దీనిని 2017లో కురుపాంలో ప్రారంభించాల్సి ఉండగా.. భవనాలు అందుబాటులో లేక పార్వతీపురం చాకలి బెలగాంలో అప్పట్లో నడుస్తున్న కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో కొన్ని గదులను తీసుకుని హడావుడిగా ప్రారంభించారు. ఈ ఏడాది గురుకుల పాఠశాలను కురుపాంనకు తరలించడంతో ఖాళీ అయిన ఈ భవనానికి పార్వతీపురం బైపాస్ రోడ్డులో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను తరలించారు. ఒక వైపు బాలుర పాఠశాల నడుస్తుండటం.. అదే ప్రాంగణంలో మరో పక్క బాలికల ఏకలవ్య పాఠశాలను కొనసాగిస్తుండటంతో ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు.. బాలికల ఏకలవ్య పాఠశాలను ఐటీడీఏ ఉద్యోగుల కోసం నిర్మించిన నివాసగృహాల(క్వార్టర్సు)లోకి తరలించారు. అక్కడ రెండు గదుల్లో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాలమైన గదుల్లేకపోవడంతో పిల్లలు వంటగదుల్లో సైతం కూర్చోవాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల కరువు ఏకలవ్య పాఠశాలలు కొత్తగా మంజూరయితే.. వాటికి అవసరమైన అ«ధ్యాపకులతో పాటు విద్యార్థులకు బెంచీలు, ఉపాధ్యాయులకు కుర్చీలు మొదలుకుని.. రికార్డుల నిర్వహణకు బీరువాలు, బోర్టులు, టేబుళ్లు వంటి మౌలికవసతులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఒక్క కుర్చీ కూడా మంజూరు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు బలవంతంగా తెచ్చి ఇక్కడ పనిచేయిస్తున్నా.. ఎలాంటి సౌకర్యాలూ కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్ఎంను కూడా నియమించలేదు. పుస్తకాలెక్కడ? విద్యాసంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. పార్వతీపురం ఏకలవ్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు 80 మంది వరకూ ఉండగా వారికి నేటికీ తెలుగు, సోషల్ సబ్జెక్టుల పుస్తకాలు అందలేదని చెబుతున్నారు. ఈ పాఠశాలల్లో ఇదివరకు స్టేట్ సిలబస్‌నే బోధించేవారు. ప్రస్తుతం సీబీఎస్ఈ సిలబస్‌ను బోధించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ఇంగ్లిష్‌లో బోధించగల అధ్యాపకులను కేటాయించాలి. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక్కడున్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేస్తున్నారు. బెంచీలు, కుర్చీలు కూడా లేవు పాఠశాలల్లో ఇంతవరకు మౌలిక వసతులు కల్పించలేదు. ఉపాధ్యాయులు కూర్చునేందుకు కుర్చీలు, విద్యార్థులకు బెంచీల్లేవు. శాశ్వత భవనాలు కూడా లేవు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పిస్తే మంచి విద్యనందించగలం. ప్రస్తుతం ఇక్కడ వ్యాయామ, సోషల్ ఉపాధ్యాయులు, ఆఫీస్ సబార్డినేట్, కుక్, వాచ్‌మేన్ వంటి సిబ్బందిని నియమించాలి. –హేమలత, ప్రిన్సిపల్, ఏకలవ్య పాఠశాల, పార్వతీపురం ఒత్తిడికి గురవుతున్నాం మాకు ఏడో తరగతికి సంబంధించి తెలుగు, సోషల్ సబ్టెక్టుల పాఠ్యపుస్తకాలు ఇంకా ఇవ్వలేదు. ఒక్కసారిగా సీబీఎస్ఈ సిలబస్‌కు మార్చడంతో ఒత్తిడికి గురవుతున్నాం. పాఠశాల ఒక చోట, వసతి మరో చోట ఉండటంతో రోజూ తిరగడం ఇబ్బందిగా ఉంది. – బిడ్డిక అలేఖ్య, విద్యార్థిని, 7వ తరగతి న్యాయపరమైన సమస్యల వల్లే ఇబ్బంది ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవగా కొంతమంది కాంట్రాక్టర్లు తమకు అన్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టునాశ్రయించారు. దీంతో ఎక్కడా భవన నిర్మాణాలు ప్రారంభంకాలేదు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్లరాదన్న ఉద్దేశంతో తాత్కాలిక భవనాల్లో తరగతులను ప్రారంభించాల్సి వచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపుతో పాటు.. మౌలిక వసతులను మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ జి.లక్ష్మిశ, ఐటీడీఏ పీవో, పార్వతీపురం -
ఏకలవ్య భవనాలకు రీ-టెండర్లు!
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ సుబ్బారావు పార్వతీపురం: రాష్ట్రంలో ఐటీడీఏకి చెందిన 8 ఏకలవ్య పాఠశాలల భవనాల నిర్మాణాలకు రీ-టెండర్లు పిలవనున్నామని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ ఎ.వి.సుబ్బారావు తెలిపారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్లు చొప్పున 8 పాఠశాలలకు రూ.84 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ పనులకు పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారన్నారు. త్వరలో అది పరిష్కరించబడుతుందన్నారు. అనంతరం రీ-టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింద ని తెలిపారు. అలాగే ఆశ్రమ పాఠశాలలకు కొత్తభవనాలు, మరమ్మత్తులు చేపడతామన్నారు. ఇటీవల బాసంగి పనుల రాద్ధాంతంపై విలేకరులు ప్రశ్నించగా.. నిర్వాసిత బాసంగిలో 36 పనులకు గాను ఇప్పటికీ ఓ మహిళా సంఘానికి 3 పనులు కేటాయించామన్నారు. మిగతా 33 పనులు వీటీడీఏలు, అక్కడ ఇంకా ఏమైనా మహిళా సంఘాలుంటే వాటికి ఆ పనులు అప్పగిస్తామన్నారు. అలాగే ఎస్డీఎఫ్లో భాగంగా రూ.18 కోట్లతో ఐటీడీఏ పరిధిలో రోడ్లు నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందామని, వాటికితోడు ఉపాధిలో రూ.85కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌కు అనుమతులు కోరామన్నారు.