
మజ్జివలసలో శంకుస్థాపన పనుల ఏర్పాట్లను పరిశీలిస్తున్న శ్రీకాంత్
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అరకులోయ మండలం గన్నెల రోడ్డులోని మజ్జివలస, పెదబయలు, జి.మాడుగుల మండల కేంద్రాల్లో మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.
ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మూడు చోట్లా నిర్మించనున్న పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించింది. ఒక్కో పాఠశాలను 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ ఆదివారం మజ్జివలసలో పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.