సాక్షి, విజయవాడ: ఏకలవ్య ఆదర్శ పాఠశాలల మూడవ జాతీయ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం శనివారం అట్టహసంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది.
ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు.
ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్ధినులు నృత్యాలు చేశారు. కాగా ఈనెల 17 వ తేదీ నుంచి 22 వ తేది వరకు నాగార్జున యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో క్రీడలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment