sports meet
-
పోలీస్ స్పోర్ట్స్ మీట్ సైనా నెహ్వాల్,సీపీ సీవీ ఆనంద్ సందడి (ఫొటోలు)
-
కడప : పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ (ఫొటోలు)
-
విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఫొటో వైరల్..
భువనేశ్వర్: ఒడిశా బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్.. మరో విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లింది. బల్లెం అతడి మెడ ఎడమ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి కుడి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. -
అట్టహసంగా ప్రారంభమైన ఏకలవ్య ఆదర్శ పాఠశాలల నేషనల్ స్పోర్ట్స్ మీట్
సాక్షి, విజయవాడ: ఏకలవ్య ఆదర్శ పాఠశాలల మూడవ జాతీయ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం శనివారం అట్టహసంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్ధినులు నృత్యాలు చేశారు. కాగా ఈనెల 17 వ తేదీ నుంచి 22 వ తేది వరకు నాగార్జున యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో క్రీడలు జరగనున్నాయి. -
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రిసనర్స్ స్పోర్ట్స్‌మీట్‌ను డీజీపీ, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి అని ప్రశంసించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీర్చిదిద్దడంలో రాజీవ్ త్రివేది పాత్ర మరువలేనిదన్నారు. రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో జైళ్లశాఖ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. అలాగే తన సహచరుడు రాజీవ్ త్రివేది డీజీగా ఉండటం.. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో గుర్తుండిపోయే విషయమన్నారు. రాజీవ్ త్రివేది మంచి క్రీడా వ్యక్తి అని.. క్రీడలు మంచి లక్షణాలను నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో అందరూ సమిష్టిగా రాణించాలని జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది సూచించారు. తెలంగాణ జైళ్లశాఖను ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, వరంగల్, చర్లపల్లి, సెంట్రల్ హైదరాబాద్ రెంజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కార్పొరేట్ స్పోర్ట్స్ మీట్ షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ సంఘం (హెచ్వైఎస్ఈఏ) కార్పొరేట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని హ్యాట్ ప్లేస్ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హెచ్వైఎస్ఈఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సి. అనసూయ, హెచ్వైఎస్ఈఏ ఉపాధ్యక్షులు భరణి అరోల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ కార్పొరేట్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తోన్న హెచ్వైఎస్ఈఏ యాజమాన్యాన్ని అభినందించారు. తమ డిపార్ట్మెంట్కు చెందిన ‘షీ టీమ్’ జట్లు కూడా ఇందులో పాల్గొని కార్పొరేట్‌కు దీటుగా రాణిస్తాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఉద్యోగుల పరంగా నిర్వహిస్తోన్న అన్ని టోర్నీలలో హెచ్వైఎస్ఈఏ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇందులో 14 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఫీల్డ్ క్రికెట్, బాక్స్ క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, పూల్, కబడ్డీ, క్యారమ్, బాస్కెట్‌బాల్ ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తారు. ఈసారి సైక్లింగ్ ఈవెంట్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో 160 జట్లు తలపడనున్నారు. పలు క్రీడాంశాల్లో నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు హెచ్వైఎస్ఈఏ సభ్య కంపెనీలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు సిద్ధమయ్యారని శ్రీనివాస్ రావు తెలిపారు. -
ఓవరాల్ చాంప్ విజ్ఞాన్ విద్యాలయ
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) చాంపియన్‌షిప్‌లో విజ్ఞాన్ విద్యాలయ (నిజాంపేట్) జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 10 రోజుల పాటు 24 క్రీడాంశాల్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 347 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. విజ్ఞాన్ చిన్నారులు 37 స్వర్ణాలు, 42 రజతాలు, 36 కాంస్య పతకాలను గెలుచుకుని తమ జట్టును అగ్రస్థానంలో నిలిపారు. 115 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) రన్నరప్‌గా నిలిచింది. హెచ్‌పీఎస్ జట్టుకు 14 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలు లభించాయి. సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్ (14 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) మూడోస్థానాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన విజ్ఞాన్ జట్టుకు రూ. 35,000, రన్నరప్‌కు రూ. 25,000 ప్రైజ్‌మనీగా లభించాయి. సన్‌ఫ్లవర్ జట్టు బహుమతిగా రూ. 20,000 అందుకుంది. ద ఫ్యూచర్‌కిడ్స్ (11 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్యాలు), సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (9 స్వర్ణాలు, 15 రజతాలు, 11 కాంస్యాలు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి పదివేల చొప్పున ప్రైజ్‌మనీని అందుకున్నాయి. -
గుంటూరులో స్పోర్ట్స్ మీట్
-
ఓవరాల్ చాంపియన్ హెచ్‌పీఎస్
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్ విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–రామంతాపూర్) జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 149 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు అండర్–14 బాలబాలికల టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సెయింట్ ఆండ్రూస్ జట్టు కైవసం చేసుకుంది. అండర్–17 బాలు ర టీమ్ విభాగంలో హెచ్‌పీఎస్ రామంతాపూర్, బాలికల కేటగిరీలో సెయింట్ ఆండ్రూస్ జట్లు... అండర్–19 కేటగిరీలో హెచ్‌పీఎస్ (బాలుర), ఏపీఎస్ ఆర్కే పురం (బాలికల) జట్లు టీమ్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీపీఎస్ చైర్మన్ కొమురయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. డీపీఎస్ జోరు సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) జట్లు జోరు కనబరుస్తున్నాయి. శనివారం జరిగిన అండర్–17 మ్యాచ్‌ల్లో డీపీఎస్ (వరంగల్) 3–1తో జూబ్లీహిల్స్ హైస్కూల్‌పై, డీపీఎస్ (విజయవాడ) 4–0తో స్పార్కిల్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, డీపీఎస్ (ఖాజాగూడ) 1–0తో భవన్స్ రామకృష్ణ జట్లపై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల్లో పరమహంస స్కూల్ 1–0తో సెయింట్ పీటర్స్‌పై, ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్ 1–0తో దేవ్ పబ్లిక్ స్కూల్‌పై, ఆర్మీ పబ్లిక్ స్కూల్ (గోల్కొండ) 5–0తో ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. టైటిల్ పోరుకు డీపీఎస్, ఓక్రిడ్జ్ జట్లు బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) నాచారం, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో డీపీఎస్ నాచారం 49–36తో గ్లెండేల్ అకాడమీ (తెలంగాణ)పై గెలుపొందగా, మరో సెమీస్ మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 32–15తో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో డీపీఎస్ 66–37తో సెయింట్ ఆండ్రూస్‌ను, గ్లెండేల్ అకాడమీ 64–43తో ఇండస్ యూనివర్సల్ జట్టును ఓడించాయి. -
వాలీబాల్ చాంప్ సెయింట్ ఆంథోనీస్
సాక్షి, హైదరాబాద్: రుక్మిణీబాయి ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ ఆంథోనీస్ బాలికల హైస్కూల్ జట్టు వాలీబాల్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో సెయింట్ ఆంథోనీస్ జట్టు 8–25, 25–20, 15–13తో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌పై విజయం సాధించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సెయింట్ ఫ్రాన్సిస్ అమ్మాయిలు రెండో గేమ్‌లో పోరాడి ఓడారు. తర్వాత నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. ఇందులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సెయింట్ ఆంథోనీస్ జట్టు రెండు పాయింట్లతో గేమ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన బాలికల జట్టును ఆంథోనిస్ స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ అభినందించారు. -
3000మీ. పరుగు విజేత ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ మీట్లో గృహవిజ్ఞాన కళాశాల విద్యార్థి సత్తా చాటాడు. రాజేంద్రనగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన 3000మీ. పరుగు ఈవెంట్లో విజేతగా నిలిచాడు. అదే కళాశాలకు చెందిన సాయి ప్రకాశ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి బాలకోటి మూడో స్థానాన్ని సాధించాడు. షాట్‌పుట్ విభాగంలో ఎస్ఆర్ నందా (అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల), కె. రవిబాబు, రాకేశ్ (పాలెం వ్యవసాయ కళాశాల) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు జావెలిన్ త్రో బాలికలు: 1. పి. బెన్లా, 2. వి. వినీత, 3. బి. మనీష టెన్నికాయింట్ బాలికలు: 1. ఎ. ఉషారాణి– ఎస్. పూజిత, 2. ఎం. అరుణ– పి. అలేఖ్య బాల్ బ్యాడ్మింటన్: 1. జగిత్యాల వ్యవసాయ కళాశాల, 2. హైదరాబాద్ గృహ విజ్ఞాన కళాశాల. -
విజేతగా కలెక్టరేట్ జట్టు
- ముగిసిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు అనంతపురం సప్తగిరిసర్కిల్ : రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ విజేతగా కలెక్టరేట్ జట్టు నిలిచింది. అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు అనంత క్రీడా మైదానంలో అథ్లెటిక్స్, లాంగ్‌జంప్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు రెండు రోజుల నుంచి నగరంలోని ఇండోర్ స్టేడియం, అనంత క్రీడా మైదానం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, కృష్ణ కళామందిరాల్లో నిర్వహించారు. జిల్లాలోని 6 సబ్ డివిజన్లలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. విజేతగా కలెక్టరేట్ జట్టు ఆదివారం జరిగిన తుదిపోరులో అనంతపురం, కలెక్టరేట్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కలెక్టరేట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. జట్టులో అక్రం 45 పరుగులు చేసి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. వ్యాఖ్యాతగా కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్‌కు ఆయన తన కామెంట్రీతో అలరించారు. కలెక్టరేట్ జట్టు విజయం దిశగా పయనించే సమయంలో ఆయన తన కామెంట్ల ద్వారా క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ మలోలా, జిల్లా రెవెన్యూ సంఘం అ«ధ్యక్షులు జయరామప్ప, భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ హరిప్రసాద్, నిజాం పాల్గొన్నారు. చివరిరోజు విజేతలు వీరే.. 100 మీ పరుగు పందెం పురుషులు అశోక్ చక్రవర్తి–కదిరి–ప్రథమ స్థానం రమేష్–అనంతపురం–ద్వితీయ స్థానం నరసింహులు–ధర్మవరం–తృతీయ స్థానం 4“100 రిలే పరుగు పందెం పురుషులు అనంతపురం–రమేష్ టీం–ప్రథమ స్థానం కళ్యాణదుర్గం–తరుణ్ టీం–ద్వితీయ స్థానం ధర్మవరం–ప్రభంజన్‌రెడ్డి టీం–తృతీయ స్థానం 4“100 మహిళలు లహరిక టీం–ప్రథమ స్థానం నందిని టీం–ద్వితీయ స్థానం బాలమ్మ టీం–తృతీయ స్థానం లాంగ్ జంప్–పురుషులు రమేష్–అనంతపురం–ప్రథమ స్థానం అశోక్ చక్రవర్తి–కదిరి–ద్వితీయ స్థానం లోకేష్–కళ్యాణదుర్గం–తృతీయ స్థానం బాల్ బ్యాడ్మింటన్ పురుషులు ధర్మవరం–ప్రథమ స్థానం కదిరి–ద్వితీయ స్థానం -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎక్సైజ్ స్పోర్‌్ట్స మీట్
విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. ఆంధ్ర లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో శనివారం జరిగిన కబడ్డీ మొదటి సెమీ ఫైనల్లో నెల్లూరుపై ప్రకాశం, రెండో సెమీ ఫైనల్లో శ్రీకాకుళంపై కృష్ణా జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. వాలీబాల్ సెమీస్‌లో పశ్చిమగోదావరిపై చిత్తూరు, తూర్పుగోదావరిపై శ్రీకాకుళం జట్లు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయాయి. అథ్లెటిక్స్ 200 మీటర్ల రన్నింగ్ పురుషుల విభాగంలో బి.మోహన్ (అనంతపురం), ఎస్.రమేష్ (చిత్తూరు), ఎస్.హరికృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మహిళల విభాగంలో ఆర్.బ్యూలా (పశ్చిమగోదావరి), కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. లాంగ్ జంప్ పురుషుల విభాగంలో ఎస్.రమేష్ (చిత్తూరు), బి.మోహన్ (అనంతపురం), ఇ.దశరథ్ (చిత్తూరు) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. హైజంప్ పురుషుల విభాగంలో బి.సింహాచలం (శ్రీకాకుళం), ఇ.దశరథ్ (చిత్తూరు), జాన్మియా (కృష్ణా), మహిళల విభాగంలోఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి), వరలక్ష్మి (కర్నూలు), శ్వేతరాణి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సైక్లింగ్ పురుషుల విభాగంలో పి.రాంబాబు (విశాఖపట్నం), బాజీ అహ్మద్ అబ్దుల్ (కృష్ణా), పి.శ్రీనివాసరెడ్డి (గుంటూరు), మహిళల విభాగంలో కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎస్.మెహæతాజ్ (కర్నూలు), ఎస్.వరలక్ష్మి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. త్రోబాల్ మహిళల విభాగంలో విశాఖపట్నం, కర్నూలు, పశ్చిమగోదావరి జట్లు వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించాయి. చెస్ పురుషుల విభాగంలో టి.శౌరి (గుంటూరు), జి.శ్రీధర్ (నెల్లూరు), కె.గిరిధర్ (తూర్పుగోదావరి), మహిళా విభాగంలో శాంతి లక్ష్మి (విశాఖపట్నం), నీలవేణి (కృష్ణా), మీనాకుమారి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాలు పొందారు. విజేతలకు శనివారం సాయంత్రం ఎక్సైజ్ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని షీల్డ్‌లు అందజేశారు.ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు, డిప్యూటీ కమిషనర్లు సత్యప్రసాద్, వైబీ భాస్కర్‌రావు, జోసెఫ్, శ్రీమన్నారాయణ, నాగలక్ష్మి, సూపరింటెండెంట్లు మురళీధర్, మనోహా, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి డీఎడ్ స్పోర్ట్స్ మీట్
బుక్కపట్నం : స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్దనున్న మైదానంలో శనివారం జిల్లా డీఎడ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ జనార్దన్‌రెడి, డైట్ వ్యాయామ అధ్యాపకుడు రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 49 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. -
జెడ్పీ స్కూల్స్పోర్ట్స్ మీట్లో చైర్మన్‌కు దక్కని గౌరవం
- ఆహ్వాన పత్రికలోనూ మల్లెలకు లభించని చోటు - విశిష్ట అతిథుల హోదాలో టీడీపీ నేతల పేర్లు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్పోర్ట్స్ మీట్లో సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌ను సంబంధిత అధికారులు విస్మరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ జే పుష్పావతి సొంతూరు నందవరంలో కర్నూలు డిస్ట్రిక్ట్ సెకండరీ స్కూల్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు జోనల్ గేమ్స్ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనాలని భారీగా ఆహ్వాన పత్రికలను అందంగా ముద్రించారు. అందులో నేతలు, అధికారులు, అనధికారులు, టీడీపీ నాయకుల పేర్లను ముద్రించిన నిర్వాహకులు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌ను మరచిపోయారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పేరును ఇతర శాఖలకు సంబంధించిన కార్యక్రమాల్లో మరచిపోయారనుకుంటే సర్దుకుపోవచ్చు కానీ సాక్షాత్తు జిల్లా పరిషత్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పేరును ముంద్రించకపోవడం గమనార్హం. నిజంగా మరచిపోయారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా ఇలా చేశారా? అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. -
‘సెడ్స్’ సేవలు అభినందనీయం
►జిల్లా విద్యాధికారి లింగయ్య ►ఘనంగా స్పోర్ట్స్ మీట్ ►పాల్గొన్న విదేశీయులు గుడిహత్నూర్ : సెడ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి లింగయ్య అన్నారు. మండలంలోని కొల్హారీ ప్రాథమికోన్నత పాఠశాలలో సెడ్స్ ఆధ్వర్యంలో ప్లాన్ ఇండియా, పర్ఫాం సంస్థల సహకారంతో మంగళవారం నిర్వహించిన వార్షిక క్రీడా సంబరాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పిల్లల అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్రీడాలతో విద్యార్థులను ఆకర్షించి మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా తాము కృషి చేస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ ఆర్.సురేందర్ తెలిపారు. స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న వృధ్ధుల ఆశ్రమం, యువజనులకు స్వయం ఉపాధి శిక్షణలు, బాల కార్మికుల నిర్మూలన, క్రీడల్లో ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి లండన్‌కు చెందిన ప్లాన్ ఇండియా, పర్ఫాం ప్రతినిధులు మైఖేల్ రాబర్ట్, ఫ్లోరియన్ డెడైరిసన్, ల్యూక్లాక్, జోసీ పార్మీ, జెసీ జోయ్లతో పాటు ప్లాన్ ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రోగ్రాం అధికారి కె.అభిలాష్ పాల్గొని సంస్థ సేవలు పరిశీలించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనపర్చిన జట్లకు బహుమతులు అందజేశారు. స్థానిక సర్పంచ్ బా లాజీ సోంటక్కే, ఎస్ఎంసీ చైర్మన్ తగ్రే ప్రకాశ్, ఎంఈవో నారాయణ, సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి, వివిధ గ్రామాల వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపిన క్రీడలు
భానుగుడి (కాకినాడ) : వారు చీకటిలో వెలుగును వెతుకుతూ పరుగెత్తారు.లక్ష్యాన్ని ఊహించుకుని బరువులు విసిరారు. విధి వంచించినా ప్రతి క్రీడలోనూ తమదైన ప్రతిభ చాటారు. మొత్తానికి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన పలు పోటీల్లో వారు చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. చూపరుల హృదయాలను కదిలించింది.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, చందరంగం, క్యారమ్స్, షాట్‌ఫుట్, సైకిల్ రేస్ వంటి పలుక్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 850 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రీడా పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. విజేతలకు డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో బహుమతీ ప్రధానం చేస్తామని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. -
డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ
నెల్లూరు (టౌన్): గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఈ నెల 26,27 తేదీల్లో జరిగిన అంతర్ కళాశాల మహిళా క్రీడాపోటీల్లో నెల్లూరు డీకేడబ్ల్యూ మహిళా కళాశాల విద్యార్థినులు సత్తాచాటి పలు పతకాలు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ పీ శైలజ తెలిపారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులను బుధవారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినులు కోకో, బాస్కెట్‌బాల్, వాలీబాల్ విభాగాల్లో విన్నర్‌గా, కబడ్డీ, బాల్బాడ్మింటిన్, షటిల్ బాడ్మింటిన్ విభాగాల్లో రన్నర్‌గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, ఫిజికల్ డైరెక్టర్ రవీంద్రమ్మ, గేమ్స్కమిటీ సభ్యులు ఉమమహేశ్వరి, అధ్యాపకులు పద్మప్రియ, అపర్ణదేవి పాల్గొన్నారు. -
‘స్పోర్ట్స్‌మీట్’ అదిరిపోవాలి !
• అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలి • ప్రాక్టికల్స్ తరగతులు ‘మమ’ అనిపిస్తే చర్యలు • ఇంటర్ విద్య ఆర్జేటీ వెంకటరమణ అనంతపురం ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల విద్యార్థులకు నిర్వహించే ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణ అదిరిపోవాలని ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కడప) వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అనంతపురం జిల్లా జూనియర్ కళాశాలల అథ్లెటిక్ అసోసియేషన్ (ఏడీజేసీఏఏ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్జేడీ మాట్లాడుతూ స్పోర్ట్స్‌మీట్‌లో అన్ని యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కోరారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు అంటూ పిల్లలపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారన్నారు. క్రీడల ద్వారా పిల్లల్లో మానసిక ప్రశాంతతో పాటు శారీరక అభివద్ధి పెరుగుతుందన్నారు. ఈసారి ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లోనే ఉంటాయని ఇప్పటి నుంచే దష్టి సారించి ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అలా కాకుండా చివరల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాక్టికల్ తరగతులు ‘మమ’ అనిపిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ అన్ని కళాశాలలు తనిఖీలుల చేస్తామని, విద్యార్థులతో మాట్లాడుతామని, రికార్డులు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడైనా ల్యాబ్ పరికరాలు తక్కువ ఉంటే తమ దష్టికి తేవాలన్నారు. ఆర్ఐఓ వెంకటేశులు మాట్లాడుతూ ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణలో గతేడాది పడిన ఇబ్బందులు ఈసారి తలెత్తకూడదన్నారు. అందరూ ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొరవడిన చిత్తశుద్ధి విద్యార్థుల క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ తూతూమంత్రంగా ఉంటోందనడానికి హాజరైన ప్రిన్సిపాళ్లు, పీడీలే నిదర్శనం. జిల్లాలో అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు 221 దాకా ఉన్నాయి. సమావేశం ఉంటుందని ఆర్ఐఓ అందరికీ సమాచారం పంపారు. పత్రికల ద్వారా కూడా మెసేజ్ పంపారు. అయినా కేవలం 50 శాతం మంది ప్రిన్సిపాళ్లు, పీడీలు హాజరయ్యారు. క్రీడల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. అధిక ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఇంత తక్కువ మంది హాజరుకావడం బాధాకరమని ఆర్జేడీ వెంకటరమణ వాపోయారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారాం, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, అధ్యక్షులు సురేష్, ఏడీజేసీఏఏ కార్యదర్శి ఎ. నాగార్జునప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విజేతలు హర్షిత, కార్తీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో ట్రిపుల్ జంప్ విభాగంలో హర్షిత, కార్తీక్‌లు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన పోటీల్లో ట్రిపుల్ జంప్ సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన హర్షిత పసిడిని దక్కించుకోగా... శ్రీరిన్ (సెయింట్ ఆన్స్), ఐశ్వర్య (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్) రజత కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర కేటగిరీలో కార్తీక్ సింగ్ (సుజాత స్కూల్), షణ్ముఖ్ సారుు తేజ, కౌశిక్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాలికల కేటగిరీలో రక్షిత (ఈఎస్ఆర్హెచ్ఎస్) తొలి స్థానంలో నిలవగా... మానస (ఈఎస్ఆర్హెచ్ఎస్), కస్తూరి (ఎన్ఏఎస్ఆర్) ద్వితీయ, తృతీయ స్థానాల్ని సంపాదించుకున్నారు. ఇతర విభాగాల్లో విజేతల వివరాలు సీనియర్ బాలికలు జావెలిన్ త్రో: 1. శ్రీవియా గణపతి (సెయింట్ జోసెఫ్ హైస్కూల్), 2. ఎన్. నవ్యశ్రీ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. సుష్మా (జాన్సన్ గ్రామర్ స్కూల్). వాకింగ్: 1. వర్ష చౌదరీ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాక్షి జైన్ (సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్), 3.ముస్కాన్ (ఎన్ఏఎస్ఆర్). హైజంప్: 1. ఇషిత (ఎన్ఏఎస్ఆర్), 2. టి. ప్రవళిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. దివ్య (హెచ్‌పీఎస్). 200మీ. పరుగు: 1. జి. నిత్య (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. విన్నీ (సెరుుంట్ ఆన్స హైస్కూల్). 3. ఆత్రేయ చక్రవర్తి (గీతాంజలి) డిస్కస్ త్రో: 1. రియా (టింపనీ స్కూల్), 2. శ్రీవియా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. క్రిసాల్డా (సెయింట్ ట్ ఆన్స్ స్కూల్). సీనియర్ బాలురు వాకింగ్: 1. రోషన్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. జై (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. వర్ధన్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్). 1500మీ: 1. పవన్ తేజ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చంద్ర (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. అనిల్ (ఫ్యూచర్కిడ్స స్కూల్). 200మీ: 1. రూపేశ్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 2. మనీశ్ (సెయింట్ ట్ జార్జ్ స్కూల్), 3. దివాకర్ (హెచ్‌పీఎస్). జూనియర్ బాలికలు హైజంప్: 1. జి. దివ్య (సెయింట్ ఆన్స్), 2. విజయవాంగి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. కీర్తన (రమాదేవి పబ్లిక్ స్కూల్). 200మీ. : 1. నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. శ్రీలక్ష్మీ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్), 3. సి. లక్ష్య (సెయింట్ జోసెఫ్ స్కూల్). జావెలిన్ త్రో: 1. జి. గీతాంజలి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. నందిని (సుజాత స్కూల్), 3. అనన్య (సుజాత స్కూల్). 3కి.మీ వాక్: 1. నవ్యశ్రీ (ఈఎస్ఆర్హెచ్ఎస్), 2. శ్రీవాసవి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. వైష్ణవి (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్). -
ఓవరాల్ చాంప్ అభ్యాస స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ సీనియర్ బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో బుధవారం వివిధ విభాగాల్లో స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. మొత్తం43 పాయింట్లతో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ చాంపియన్‌గా నిలవగా... 30 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. జూనియర్ బాలుర కేటగిరీలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (26 పాయింట్లు), గీతాంజలి స్కూల్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో రోనక్ జైశ్వాల్ (100మీ. ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ బ్రెస్ట్ స్ట్రోక్), అభ్యాస్ పట్వారీ (50మీ ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ. బటర్‌ఫ్లయ్) స్వర్ణాలు సాధించగా... సీనియర్ బాలుర కేటగిరీలో అదిత్య (50మీ. , 100మీ. బటర్‌ఫ్లయ్), ఆయుష్మాన్ దీక్షిత్ (50మీ., 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్) పసిడి పతకాలతో మెరిశారు. -
28నుంచి ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్
జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ ఈనెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని సింహాద్రి ప్రాజెక్టులో నిర్వహిస్తున్నట్లు రామగుండం స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మంగళంపల్లి రాంనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ పోటీలకు 30 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
ఓడిన వైకల్యం
ఓడిన వైకల్యం కొరుక్కుపేట : ఆత్మస్థైరం ముందు వైకల్యం ఓడింది అనడానికి శనివారం జరిగిన 13వ వార్షిక రాష్ట్ర స్థాయి వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌లో వికలాంగు క్రీడాకారుల ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది. వికలాంగులు వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాను చాటారు. తమిళనాడు వికలాంగుల సంక్షేమ చారిట బుల్ ట్రస్ట్, తమిళనాడు పారాఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా శని వారం చెన్నై, ఎస్‌డీఏటీ నెహ్రూ కాం ప్లెక్స్ వేదికగా వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌ను నిర్వహించారు. టీ.ఎన్.డి.ఎ.ఎఫ్.సి. ట్రస్ట్ అధ్యక్షులు జి.చిదంబరనాథన్ అధ్యక్షత వహించిన క్రీడా పోటీలను సాంఘీక సంక్షేమ విభాగం, వికలాంగుల సంక్షేమ మంత్రి పి.వలర్మతి, వికలాంగుల సంక్షేమ విభాగం రాష్ట్ర కమిషనర్ మణివాసన్ హాజరై ప్రారంభించా రు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది వికలాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కానరాదంటూ అన్న విధంగా పరుగుపందేలలోను, కబడ్డీలోను, షార్ట్ఫుట్లోను, ఇతర క్రీడలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిదంబరనాథన్ మాట్లాడుతూ ఈ పోటీలు తర్ఫీదుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర స్థాయిలో 67 మంది వికలాంగ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిభను కనబరిచారని, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. -
రెసిడెన్షియల్స్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బుధవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మొదలైన ఈ పోటీలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.వాణి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో లేని ఎన్నో అంశాలను ఆటల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ఫాస్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 పాఠశాలలకు చెందిన 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లయ బట్టు తదితరులు పాల్గొన్నారు.