సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో విజ్ఞాన్ విద్యాలయ (నిజాంపేట్) జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 10 రోజుల పాటు 24 క్రీడాంశాల్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 347 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. విజ్ఞాన్ చిన్నారులు 37 స్వర్ణాలు, 42 రజతాలు, 36 కాంస్య పతకాలను గెలుచుకుని తమ జట్టును అగ్రస్థానంలో నిలిపారు. 115 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) రన్నరప్‌గా నిలిచింది. హెచ్‌పీఎస్ జట్టుకు 14 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలు లభించాయి.
సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్ (14 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) మూడోస్థానాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన విజ్ఞాన్ జట్టుకు రూ. 35,000, రన్నరప్‌కు రూ. 25,000 ప్రైజ్‌మనీగా లభించాయి. సన్‌ఫ్లవర్ జట్టు బహుమతిగా రూ. 20,000 అందుకుంది. ద ఫ్యూచర్‌కిడ్స్ (11 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్యాలు), సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (9 స్వర్ణాలు, 15 రజతాలు, 11 కాంస్యాలు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి పదివేల చొప్పున ప్రైజ్‌మనీని అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment