సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో కె. శివాని స్వర్ణ పతకాల పంట పండించింది. గచి్చ»ౌలి స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌లో సోమవారం జరిగిన ఈ పోటీల్లో శివాని ఏకంగా ఐదు పసిడి పతకాలను హస్తగతం చేసుకుంది. ఆమె 200మీ. వ్యక్తిగత మెడ్లే, 50మీ. బ్యాక్‌స్ట్రోక్, 50మీ. ఫ్రీస్టయిల్, 50మీ. బ్రెస్ట్ స్ట్రోక్, 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచింది. గచ్చిబౌలి స్విమ్మింగ్‌పూల్ జట్టుకు చెందిన ఇషాన్ దూబే కూడా 3 స్వర్ణాలతో సత్తా చాటాడు. అతను 50మీ. ఫ్రీస్టయిల్ (28.80సె.), 100మీ. ఫ్రీస్టయిల్ (1ని.07.20సె., 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్ (1ని.27.30సె.) విభాగాల్లో విజేతగా నిలిచాడు.
మరో స్విమ్మర్ ఎం. హనుమాన్ 2 స్వర్ణాలు, 2 రజతాలతో ఆకట్టుకున్నాడు. 100మీ. బటర్‌ఫ్లయ్ (1ని.10.02సె.), 100మీ. బ్యాక్‌స్ట్రోక్ (1ని.12.85సె.) విభాగాల్లో పసిడి పతకాలను దక్కించుకున్న హనుమాన్... 200మీ. వ్యక్తిగత మెడ్లే (2ని.42.95సె.), 50మీ. ఫ్రీస్టయిల్ (28.52 సె.) ఈవెంట్‌లలో రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో గచ్చి»ౌలి స్విమ్ టీమ్ మొత్తం 33 పతకాలను కొల్లగొట్టింది. ఇందులో 13 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మొత్తం 900 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment