
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు నిర్వహిస్తోన్న స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞయ మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులు వరుసగా దిశా సింఘాల్, ముజ్తబా అలీ మొహమ్మద్ మెరిశారు. గచ్చిబౌలి జరుగుతోన్న ఈ టోర్నీ అండర్–9 కరాటే కటా ఈవెంట్‌లో దిశా పసిడి పతకాన్ని గెలుచుకోగా... కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్ విద్యార్థి భార్గవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్చరీ ఈవెంట్‌లో మజ్తబా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్–19 బాలుర ఆర్చరీ రికర్వ్ ఈవెంట్‌లో ముజ్తబా విజేతగా నిలిచాడు. అగీ్నవ (ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్), తజమ్ముల్ (నారాయణన్ జూనియర్ కాలేజి) రజత, కాంస్య పతకాలను సాధించారు.
కాంపౌండ్ విభాగంలో ఆర్యన్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) బంగారు పతకాన్ని అందుకోగా... హర్‌్ష (శ్రీ హనుమాన్ వ్యాయామశాల) రజతాన్ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌కు చెందిన ప్రథమ్ కాంస్యాన్ని సాధించాడు. అండర్–14 బాలికల కేటగిరీలో కశ్వి అగర్వాల్ (భారతీయ విద్యా భవన్), అక్షర (సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్) వరుసగా స్వర్ణ, రజతాలను సొంతం చేసుకున్నారు. శ్రేష్టారెడ్డి (పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అండర్–11 బాలికల కటా ఈవెంట్‌లో శిక్ష (భవన్స్ శ్రీ రామకృష్ణ), రినీషా యాదవ్ (సూర్య ద గ్లోబల్ స్కూల్), షగుణ్ (కేంద్రీయ విద్యాలయ) తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment