సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) ఫౌండేషన్ నుంచి రేపటి తరం పీటీ ఉష, మిల్కా సింగ్‌లు తయారవుతారని భారత ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఏ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అతను ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆనందపరిచారు. నేటి చిన్నారులే రేపటి తరం స్పోర్ట్స్ చాంపియన్‌లని అన్నాడు. ‘అత్యున్నత స్థాయి మౌలిక సౌకర్యాలు ఉండటమే కాదు. వాటిని సమర్థంగా ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప ఆటగాళ్లను తీర్చి దిద్దాల్సి ఉంది.
ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌ఏ మంచి ప్రయత్నం చేస్తోంది. ఇలాటి వేదికలనుంచి పీటీ ఉష, మిల్కా సింగ్‌లాంటి స్టార్ అథ్లెట్లు వెలుగులోకి వస్తారు‘ అని భజ్జీ అభిప్రాయ పడ్డాడు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఏ వ్యవస్థాపకుడు రిషికేశ్‌ను అతను అభినందించాడు. పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ రిషికేశ్... విద్యార్థులు క్రీడా రంగాన్ని ఎంచుకునేందుకు మార్గదర్శిగా నిలుస్తున్నారన్నాడు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment