సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ టోర్నమెంట్‌లో అండర్–14 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్ పోటీల్లో ఇషాన్ దూబే (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూటన్ క్యాంపస్) చాంపియన్‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్‌లో ఇషాన్ 29.80 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచాడు. నవనీత్ బాలసాయి శ్రీకర్ (జాన్సన్ గ్రామర్ స్కూల్) రెండో స్థానంలో, శశిధర్ రెడ్డి (భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ–సైనిక్‌పురి) మూడో స్థానంలో నిలిచాడు. అండర్–16 బాలుర విభాగంలో జరిగిన 50 మీ. ఫ్రీస్టయిల్ ఈతలో సాయి నిహార్ (ది గ్రీక్ ప్లానెట్ స్కూల్–బాచుపల్లి) తొలి స్థానంలో నిలిచాడు. ప్రణయ్ సాయి (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూటన్ క్యాంపస్), శర్మ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఇతర విజేతలు
అండర్–18 బాలుర 50 మీ.ఫ్రీస్టయిల్: 1.ఆర్యన్ మోహిత్ (వరల్డ్ వన్ స్కూల్–కొండాపూర్) 2.భరత్ కుమార్ (మెలుహ ఇంటర్నేషనల్ స్కూల్).
అండర్–16 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1.లక్ష్మీ గోగలుపాటి (ఓం విద్యాలయ–మన్సూరాబాద్) 2. కశ్యపి విశాల్ గల్వాంకర్ (జాన్సన్ గ్రామర్ స్కూల్) 3. ఆధ్య బాలకృష్ణ (గ్లెండెల్ అకాడమీ, సన్‌సిటీ).
అండర్–14 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1. కాత్యాయని (విద్యారణ్య హైస్కూల్–సైఫా బాద్) 2. వృత్తి అగర్వాల్ (భారతీయ విద్యా భవన్స్ స్కూల్–జూబ్లీహిల్స్) 3. యోగితా రెడ్డి (జాన్సన్ స్కూల్–సీబీఎస్‌ఈ).
అండర్–12 బాలుర 50 మీ. ఫ్రీస్టయిల్: 1. గౌతం శశి (ఎస్‌ఆర్ డీజీ స్కూల్– సికింద్రాబాద్) 2. ఫ్రాంక్లిన్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) 3. వర్షిత (ప్రగతి సెంట్రల్ స్కూల్).
అండర్–12 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1. లాస్య (ఓం విద్యాలయం–మన్సూరాబాద్) 2. ప్రీతిక (గోల్కొండ) 3. వేదశ్రీ ఉప్పాల (చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్–సీబీఎస్‌ఈ).
బాస్కెట్‌బాల్ విజేతలు: 1. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2. ఫోనిక్స్ గ్రీన్ ఇంటర్నేషనల్ స్కూల్ 3. ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పాలగూడ) హ్యాండ్‌బాల్: 1. ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పాలగూడ) 2. ఒలీవ్‌మౌంట్ గ్లోబల్ స్కూల్ 3. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్.
, , ,
Comments
Please login to add a commentAdd a comment