సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు ఆకట్టుకుంది. గచి్చ»ౌలిలో జరుగుతోన్న ఈ టోరీ్నలో బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో ఫ్యూచర్‌కిడ్స్ విజేతగా నిలిచింది. అండర్–14 బాలికల బాస్కెట్‌బాల్ ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్–1 16–8తో ఫ్యూచర్ కిడ్స్–2 జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 19–2తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందింది. ఫుట్‌బాల్ విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఫ్యూచర్‌కిడ్స్ 2–0తో విజ్ఞాన్ విద్యాలయపై, ఓక్రిడ్జ్ 2–0తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందాయి. హ్యాండ్‌బాల్ ఈవెంట్‌లో భారతీయ విద్యా భవన్స్, గతి ప్రభుత్వ స్కూల్ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–16 బాలుర ఫైనల్లో భారతీయ విద్యాభవన్స్ 8–5తో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై... బాలికల ఫైనల్లో గతి ప్రభుత్వ స్కూల్ 3–0తో విజ్ఞాన్ విద్యాలయపై గెలుపొందారు.
ఇతర ఈవెంట్‌ల ఫలితాలు
బ్యాడ్మింటన్ అండర్–13 బాలికల మూడో రౌండ్: వర్షిత (ప్రగతి సెంట్రల్ స్కూల్) 21–7తో అనుష్క రంజన్ (డీపీఎస్), తేజస్విని (ఫోనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్) 21–7తో ప్రజ్ఞ (లిటిల్ ఫ్లవర్ హైస్కూల్)పై, ఆద్య (ఓక్రిడ్జ్) 21–5తో కీర్తన (ఫ్యూచర్‌కిడ్స్)పై గెలుపొందారు.
బాలురు: అక్షయ్ (అరోహన్ ద కంప్లీట్ స్కూల్) 21–6తో గణేశ్ (వరల్డ్ వన్ స్కూల్)పై, సాయి యశోధర్ (డీపీఎస్) 21–16తో ఆదర్శ్ బాలాజీ (భారతీయ విద్యా భవన్స్)పై, వసంత్ 21–18తో కమలేశ్ (విజ్ఞాన్ విద్యాలయ)పై నెగ్గారు.
ఖో–ఖో అండర్–14 బాలికల క్వార్టర్స్: విజ్ఞాన్ విద్యాలయ 8–6తో ఫ్యూచర్‌కిడ్స్‌పై, ప్రణవ్ 10–9తో ఫోనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, కార్నర్ స్టోన్ స్కూల్ (ఎ) 7–2తో కార్నర్ స్టోన్ స్కూల్ (బి)పై విజయం సాధించారు.
స్విమ్మింగ్ అండర్–16 బాలుర 100మీ. ఫ్రీస్టయిల్: 1. చార్లెస్ ఫిన్నీ, 2. చార్లెస్ వెస్లీ (వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్), 3. ఇషాన్ (చిరెక్ స్కూల్); బాలికలు: 1. రాజ్ లక్ష్మి (ఓం విద్యాలయ), 2. కశ్యపి (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. ఆద్య (సన్‌సిటీ).
∙అండర్–14 బాలికల 100మీ. ఫ్రీస్టయిల్: 1.వృత్తి అగర్వాల్, 2. కాత్యాయని, 3. దిశా
Comments
Please login to add a commentAdd a comment