Sports for All
-
ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్టింది. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ. 12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్ఎఫ్ఏ స్పాన్సర్షిప్ లభించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్ఎఫ్ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది. -
స్విమ్మింగ్‌లో శివానికి ఐదు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) చాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో కె. శివాని స్వర్ణ పతకాల పంట పండించింది. గచి్చ»ౌలి స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌లో సోమవారం జరిగిన ఈ పోటీల్లో శివాని ఏకంగా ఐదు పసిడి పతకాలను హస్తగతం చేసుకుంది. ఆమె 200మీ. వ్యక్తిగత మెడ్లే, 50మీ. బ్యాక్‌స్ట్రోక్, 50మీ. ఫ్రీస్టయిల్, 50మీ. బ్రెస్ట్ స్ట్రోక్, 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచింది. గచ్చిబౌలి స్విమ్మింగ్‌పూల్ జట్టుకు చెందిన ఇషాన్ దూబే కూడా 3 స్వర్ణాలతో సత్తా చాటాడు. అతను 50మీ. ఫ్రీస్టయిల్ (28.80సె.), 100మీ. ఫ్రీస్టయిల్ (1ని.07.20సె., 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్ (1ని.27.30సె.) విభాగాల్లో విజేతగా నిలిచాడు. మరో స్విమ్మర్ ఎం. హనుమాన్ 2 స్వర్ణాలు, 2 రజతాలతో ఆకట్టుకున్నాడు. 100మీ. బటర్‌ఫ్లయ్ (1ని.10.02సె.), 100మీ. బ్యాక్‌స్ట్రోక్ (1ని.12.85సె.) విభాగాల్లో పసిడి పతకాలను దక్కించుకున్న హనుమాన్... 200మీ. వ్యక్తిగత మెడ్లే (2ని.42.95సె.), 50మీ. ఫ్రీస్టయిల్ (28.52 సె.) ఈవెంట్లలో రజత పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో గచ్చి»ౌలి స్విమ్ టీమ్ మొత్తం 33 పతకాలను కొల్లగొట్టింది. ఇందులో 13 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మొత్తం 900 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. -
విజేత ఫ్యూచర్‌కిడ్స్
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) చాంపియన్‌షిప్‌లో ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు ఆకట్టుకుంది. గచి్చ»ౌలిలో జరుగుతోన్న ఈ టోరీ్నలో బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఫ్యూచర్‌కిడ్స్ విజేతగా నిలిచింది. అండర్–14 బాలికల బాస్కెట్‌బాల్ ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్–1 16–8తో ఫ్యూచర్ కిడ్స్–2 జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 19–2తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందింది. ఫుట్‌బాల్ విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఫ్యూచర్‌కిడ్స్ 2–0తో విజ్ఞాన్ విద్యాలయపై, ఓక్రిడ్జ్ 2–0తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందాయి. హ్యాండ్‌బాల్ ఈవెంట్లో భారతీయ విద్యా భవన్స్, గతి ప్రభుత్వ స్కూల్ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–16 బాలుర ఫైనల్లో భారతీయ విద్యాభవన్స్ 8–5తో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై... బాలికల ఫైనల్లో గతి ప్రభుత్వ స్కూల్ 3–0తో విజ్ఞాన్ విద్యాలయపై గెలుపొందారు. ఇతర ఈవెంట్ల ఫలితాలు బ్యాడ్మింటన్ అండర్–13 బాలికల మూడో రౌండ్: వర్షిత (ప్రగతి సెంట్రల్ స్కూల్) 21–7తో అనుష్క రంజన్ (డీపీఎస్), తేజస్విని (ఫోనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్) 21–7తో ప్రజ్ఞ (లిటిల్ ఫ్లవర్ హైస్కూల్)పై, ఆద్య (ఓక్రిడ్జ్) 21–5తో కీర్తన (ఫ్యూచర్‌కిడ్స్)పై గెలుపొందారు. బాలురు: అక్షయ్ (అరోహన్ ద కంప్లీట్ స్కూల్) 21–6తో గణేశ్ (వరల్డ్ వన్ స్కూల్)పై, సాయి యశోధర్ (డీపీఎస్) 21–16తో ఆదర్శ్ బాలాజీ (భారతీయ విద్యా భవన్స్)పై, వసంత్ 21–18తో కమలేశ్ (విజ్ఞాన్ విద్యాలయ)పై నెగ్గారు. ఖో–ఖో అండర్–14 బాలికల క్వార్టర్స్: విజ్ఞాన్ విద్యాలయ 8–6తో ఫ్యూచర్కిడ్స్పై, ప్రణవ్ 10–9తో ఫోనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, కార్నర్ స్టోన్ స్కూల్ (ఎ) 7–2తో కార్నర్ స్టోన్ స్కూల్ (బి)పై విజయం సాధించారు. స్విమ్మింగ్ అండర్–16 బాలుర 100మీ. ఫ్రీస్టయిల్: 1. చార్లెస్ ఫిన్నీ, 2. చార్లెస్ వెస్లీ (వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్), 3. ఇషాన్ (చిరెక్ స్కూల్); బాలికలు: 1. రాజ్ లక్ష్మి (ఓం విద్యాలయ), 2. కశ్యపి (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. ఆద్య (సన్‌సిటీ). ∙అండర్–14 బాలికల 100మీ. ఫ్రీస్టయిల్: 1.వృత్తి అగర్వాల్, 2. కాత్యాయని, 3. దిశా -
చాంపియన్ ఇషాన్ దూబే
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ టోర్నమెంట్లో అండర్–14 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్ పోటీల్లో ఇషాన్ దూబే (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూటన్ క్యాంపస్) చాంపియన్‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్లో ఇషాన్ 29.80 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచాడు. నవనీత్ బాలసాయి శ్రీకర్ (జాన్సన్ గ్రామర్ స్కూల్) రెండో స్థానంలో, శశిధర్ రెడ్డి (భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ–సైనిక్‌పురి) మూడో స్థానంలో నిలిచాడు. అండర్–16 బాలుర విభాగంలో జరిగిన 50 మీ. ఫ్రీస్టయిల్ ఈతలో సాయి నిహార్ (ది గ్రీక్ ప్లానెట్ స్కూల్–బాచుపల్లి) తొలి స్థానంలో నిలిచాడు. ప్రణయ్ సాయి (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, న్యూటన్ క్యాంపస్), శర్మ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇతర విజేతలు అండర్–18 బాలుర 50 మీ.ఫ్రీస్టయిల్: 1.ఆర్యన్ మోహిత్ (వరల్డ్ వన్ స్కూల్–కొండాపూర్) 2.భరత్ కుమార్ (మెలుహ ఇంటర్నేషనల్ స్కూల్). అండర్–16 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1.లక్ష్మీ గోగలుపాటి (ఓం విద్యాలయ–మన్సూరాబాద్) 2. కశ్యపి విశాల్ గల్వాంకర్ (జాన్సన్ గ్రామర్ స్కూల్) 3. ఆధ్య బాలకృష్ణ (గ్లెండెల్ అకాడమీ, సన్‌సిటీ). అండర్–14 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1. కాత్యాయని (విద్యారణ్య హైస్కూల్–సైఫా బాద్) 2. వృత్తి అగర్వాల్ (భారతీయ విద్యా భవన్స్ స్కూల్–జూబ్లీహిల్స్) 3. యోగితా రెడ్డి (జాన్సన్ స్కూల్–సీబీఎస్ఈ). అండర్–12 బాలుర 50 మీ. ఫ్రీస్టయిల్: 1. గౌతం శశి (ఎస్ఆర్ డీజీ స్కూల్– సికింద్రాబాద్) 2. ఫ్రాంక్లిన్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) 3. వర్షిత (ప్రగతి సెంట్రల్ స్కూల్). అండర్–12 బాలికల 50 మీ. ఫ్రీస్టయిల్: 1. లాస్య (ఓం విద్యాలయం–మన్సూరాబాద్) 2. ప్రీతిక (గోల్కొండ) 3. వేదశ్రీ ఉప్పాల (చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్–సీబీఎస్ఈ). బాస్కెట్‌బాల్ విజేతలు: 1. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2. ఫోనిక్స్ గ్రీన్ ఇంటర్నేషనల్ స్కూల్ 3. ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పాలగూడ) హ్యాండ్‌బాల్: 1. ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పాలగూడ) 2. ఒలీవ్మౌంట్ గ్లోబల్ స్కూల్ 3. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్. , , , -
దిశా, ముజ్తబాలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు నిర్వహిస్తోన్న స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) చాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞయ మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులు వరుసగా దిశా సింఘాల్, ముజ్తబా అలీ మొహమ్మద్ మెరిశారు. గచ్చిబౌలి జరుగుతోన్న ఈ టోర్నీ అండర్–9 కరాటే కటా ఈవెంట్లో దిశా పసిడి పతకాన్ని గెలుచుకోగా... కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్ విద్యార్థి భార్గవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్చరీ ఈవెంట్లో మజ్తబా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్–19 బాలుర ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ముజ్తబా విజేతగా నిలిచాడు. అగీ్నవ (ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్), తజమ్ముల్ (నారాయణన్ జూనియర్ కాలేజి) రజత, కాంస్య పతకాలను సాధించారు. కాంపౌండ్ విభాగంలో ఆర్యన్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) బంగారు పతకాన్ని అందుకోగా... హర్‌్ష (శ్రీ హనుమాన్ వ్యాయామశాల) రజతాన్ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌కు చెందిన ప్రథమ్ కాంస్యాన్ని సాధించాడు. అండర్–14 బాలికల కేటగిరీలో కశ్వి అగర్వాల్ (భారతీయ విద్యా భవన్), అక్షర (సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్) వరుసగా స్వర్ణ, రజతాలను సొంతం చేసుకున్నారు. శ్రేష్టారెడ్డి (పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అండర్–11 బాలికల కటా ఈవెంట్లో శిక్ష (భవన్స్ శ్రీ రామకృష్ణ), రినీషా యాదవ్ (సూర్య ద గ్లోబల్ స్కూల్), షగుణ్ (కేంద్రీయ విద్యాలయ) తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. -
ఓవరాల్ చాంప్ విజ్ఞాన్ విద్యాలయ
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) చాంపియన్‌షిప్‌లో విజ్ఞాన్ విద్యాలయ (నిజాంపేట్) జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 10 రోజుల పాటు 24 క్రీడాంశాల్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 347 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. విజ్ఞాన్ చిన్నారులు 37 స్వర్ణాలు, 42 రజతాలు, 36 కాంస్య పతకాలను గెలుచుకుని తమ జట్టును అగ్రస్థానంలో నిలిపారు. 115 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) రన్నరప్‌గా నిలిచింది. హెచ్‌పీఎస్ జట్టుకు 14 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలు లభించాయి. సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్ (14 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) మూడోస్థానాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన విజ్ఞాన్ జట్టుకు రూ. 35,000, రన్నరప్‌కు రూ. 25,000 ప్రైజ్‌మనీగా లభించాయి. సన్‌ఫ్లవర్ జట్టు బహుమతిగా రూ. 20,000 అందుకుంది. ద ఫ్యూచర్‌కిడ్స్ (11 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్యాలు), సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (9 స్వర్ణాలు, 15 రజతాలు, 11 కాంస్యాలు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి పదివేల చొప్పున ప్రైజ్‌మనీని అందుకున్నాయి. -
ఉష, మిల్కాసింగ్లు తయారవుతారు!
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) ఫౌండేషన్ నుంచి రేపటి తరం పీటీ ఉష, మిల్కా సింగ్‌లు తయారవుతారని భారత ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన ఎస్ఎఫ్ఏ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అతను ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆనందపరిచారు. నేటి చిన్నారులే రేపటి తరం స్పోర్ట్స్ చాంపియన్లని అన్నాడు. ‘అత్యున్నత స్థాయి మౌలిక సౌకర్యాలు ఉండటమే కాదు. వాటిని సమర్థంగా ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప ఆటగాళ్లను తీర్చి దిద్దాల్సి ఉంది. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఏ మంచి ప్రయత్నం చేస్తోంది. ఇలాటి వేదికలనుంచి పీటీ ఉష, మిల్కా సింగ్‌లాంటి స్టార్ అథ్లెట్లు వెలుగులోకి వస్తారు‘ అని భజ్జీ అభిప్రాయ పడ్డాడు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకుడు రిషికేశ్‌ను అతను అభినందించాడు. పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ రిషికేశ్... విద్యార్థులు క్రీడా రంగాన్ని ఎంచుకునేందుకు మార్గదర్శిగా నిలుస్తున్నారన్నాడు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.