విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఫొటో వైరల్.. | Javelin Pierces Students Neck During Sports Meet Odisha | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ మీట్‌లో అపశ్రుతి.. విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఐసీయూలో చికిత్స

Published Sat, Dec 17 2022 9:22 PM | Last Updated on Sat, Dec 17 2022 9:56 PM

Javelin Pierces Students Neck During Sports Meet Odisha - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్‌ మీట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్.. మరో విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లింది. బల్లెం అతడి మెడ ఎడమ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి కుడి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement