javelin
-
సాహో బల్లెం వీరుడా.. రజతంతో మెరిసిన నీరజ్ (ఫొటోలు)
-
విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఫొటో వైరల్..
భువనేశ్వర్: ఒడిశా బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్.. మరో విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లింది. బల్లెం అతడి మెడ ఎడమ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి కుడి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. -
నీరజ్ చోప్రా 'జావెలిన్'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే?
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో అథ్లెట్ విభాగంలో తొలి పతకం.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో వాడిన జావెలిన్‌ను ఈ-వేలంలో బీసీసీఐ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నీరజ్ జావెలిన్‌ను దాదాపు రూ.1.5 కోట్ల బిడ్‌తో బీసీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత ప్రధాని టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తన నివాసానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అథ్లెట్లను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా.. ప్రధాని మోదీకి ఒక జావెలిన్‌ను అందజేశాడు. దీనితో పాటు మరికొందరు అథ్లెట్లు కూడా తమ వస్తువులను ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చారు. మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ పతకాలతో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు చెందిన వస్తువులను వేలం వేయాలని ప్రధాని భావించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ''నమామి గంగే'' కార్యక్రమానికి ఉపయోగించాలని ప్రధాని తీర్మానించారు. కాగా 2014లో గంగా నది పరిరక్షణ, పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో ప్రధాని మోదీ నమామి గంగే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కాగా కోవిడ్-19 తొలి దశలో బీసీసీఐ పీఎం కేర్ ఫండ్స్‌కు రూ. 50 కోట్లు విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్- అక్టోబర్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకు చెందిన వస్తువులకు ఈ-వేలం నిర్వహించారు. ఫెన్సర్ భవానీ దేవీ తాజాగా ఈ-వేలానికి సంబంధించిన వివరాలు వెల్లడించగా.. నీరజ్ చోప్రా జావెలిన్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా.. చివరకు బీసీసీఐ రూ. 1.5 కోట్లు బిడ్ వేసి దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే మహిళా ఫెన్సర్ భవానీ దేవి వాడిని ఖరవాలానికి రూ 1.25 కోట్ల ధర పలకడం విశేషం. అలాగే పారాలింపియన్ సుమిత్ అంటిల్ జావెలిన్‌ను రూ. 1.002 కోట్లకు మరొక సంస్థ సొంతం చేసుకుంది. సుమిత్ అంటిల్ అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ బాక్సింగ్ గ్లోవ్స్ రూ. 91 లక్షలకు అమ్ముడయ్యాయి. ఓవరాల్‌గా ఈ-వేలానికి దాదాపు 8600 బిడ్స్ రావడం విశేషం. ఇక ఇటీవలే నీరజ్ చోప్రా తాను స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోను లుసానే ఒలింపిక్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని లుసానే ఒలింపిక్ మ్యూజియం నిర్వాహకులు తమ ట్విటర్లో అధికారికంగా ప్రకటించారు. చదవండి: Neeraj Chopra: చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ Serena Williams-Lebron James: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
‛స్వర్ణ’ సుందర్
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎఫ్–46 కేటగిరిలో తలపడిన అతను బంగారు పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. సోమవారం జరిగిన ఈ పోటీలో సుందర్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. అజిత్ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. 23 ఏళ్ల సుందర్ గుర్జర్ తాజా స్వర్ణంతో వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్ నెగ్గిన రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్ (2017) ఈవెంట్లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్–2013, దోహా–2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఎఫ్–56 డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా రజతం గెలిచాడు. అతను డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. -
మంత్రగత్తె నెపంతో జాతీయ క్రీడాకారిణిపై దాడి
దిపూ(అసోం): జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ మహిళపై మంత్రగత్తె అనే అనుమానంతో దాడి చేసిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. కర్బి అంగోలా జిల్లా చేరేకులిలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. జావలిన్ త్రోలో జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన దేబజాని బోరాను నిందితులు బుధవారం సాయంత్రం కట్టేసి చితకబాదినట్లు ఎస్పీ ఎంజే మహంతా తెలిపారు. గ్రామంలో సమస్యలకు ఆమే కారణమనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గాయపడి స్పృహ కోల్పోయిన దేబజానిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.