ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎక్సైజ్ స్పోర్‌్ట్స మీట్
Published Sat, Feb 4 2017 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. ఆంధ్ర లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో శనివారం జరిగిన కబడ్డీ మొదటి సెమీ ఫైనల్లో నెల్లూరుపై ప్రకాశం, రెండో సెమీ ఫైనల్లో శ్రీకాకుళంపై కృష్ణా జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. వాలీబాల్ సెమీస్‌లో పశ్చిమగోదావరిపై చిత్తూరు, తూర్పుగోదావరిపై శ్రీకాకుళం జట్లు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయాయి. అథ్లెటిక్స్ 200 మీటర్ల రన్నింగ్ పురుషుల విభాగంలో బి.మోహన్ (అనంతపురం), ఎస్.రమేష్ (చిత్తూరు), ఎస్.హరికృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మహిళల విభాగంలో ఆర్.బ్యూలా (పశ్చిమగోదావరి), కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. లాంగ్ జంప్ పురుషుల విభాగంలో ఎస్.రమేష్ (చిత్తూరు), బి.మోహన్ (అనంతపురం), ఇ.దశరథ్ (చిత్తూరు) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. హైజంప్ పురుషుల విభాగంలో బి.సింహాచలం (శ్రీకాకుళం), ఇ.దశరథ్ (చిత్తూరు), జాన్మియా (కృష్ణా), మహిళల విభాగంలోఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి), వరలక్ష్మి (కర్నూలు), శ్వేతరాణి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సైక్లింగ్ పురుషుల విభాగంలో పి.రాంబాబు (విశాఖపట్నం), బాజీ అహ్మద్ అబ్దుల్ (కృష్ణా), పి.శ్రీనివాసరెడ్డి (గుంటూరు), మహిళల విభాగంలో కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎస్.మెహæతాజ్ (కర్నూలు), ఎస్.వరలక్ష్మి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. త్రోబాల్ మహిళల విభాగంలో విశాఖపట్నం, కర్నూలు, పశ్చిమగోదావరి జట్లు వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించాయి. చెస్ పురుషుల విభాగంలో టి.శౌరి (గుంటూరు), జి.శ్రీధర్ (నెల్లూరు), కె.గిరిధర్ (తూర్పుగోదావరి), మహిళా విభాగంలో శాంతి లక్ష్మి (విశాఖపట్నం), నీలవేణి (కృష్ణా), మీనాకుమారి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాలు పొందారు. విజేతలకు శనివారం సాయంత్రం ఎక్సైజ్ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని షీల్డ్‌లు అందజేశారు.ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు, డిప్యూటీ కమిషనర్లు సత్యప్రసాద్, వైబీ భాస్కర్‌రావు, జోసెఫ్, శ్రీమన్నారాయణ, నాగలక్ష్మి, సూపరింటెండెంట్లు మురళీధర్, మనోహా, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement