ఓడిన వైకల్యం
ఓడిన వైకల్యం
కొరుక్కుపేట :
ఆత్మస్థైరం ముందు వైకల్యం ఓడింది అనడానికి శనివారం జరిగిన 13వ వార్షిక రాష్ట్ర స్థాయి వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌లో వికలాంగు క్రీడాకారుల ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది. వికలాంగులు వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాను చాటారు.
తమిళనాడు వికలాంగుల సంక్షేమ చారిట బుల్ ట్రస్ట్, తమిళనాడు పారాఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా శని వారం చెన్నై, ఎస్‌డీఏటీ నెహ్రూ కాం ప్లెక్స్ వేదికగా వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌ను నిర్వహించారు. టీ.ఎన్.డి.ఎ.ఎఫ్.సి. ట్రస్ట్ అధ్యక్షులు జి.చిదంబరనాథన్ అధ్యక్షత వహించిన క్రీడా పోటీలను సాంఘీక సంక్షేమ విభాగం, వికలాంగుల సంక్షేమ మంత్రి పి.వలర్మతి, వికలాంగుల సంక్షేమ విభాగం రాష్ట్ర కమిషనర్ మణివాసన్ హాజరై ప్రారంభించా రు.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది వికలాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కానరాదంటూ అన్న విధంగా పరుగుపందేలలోను, కబడ్డీలోను, షార్ట్‌ఫుట్‌లోను, ఇతర క్రీడలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిదంబరనాథన్ మాట్లాడుతూ ఈ పోటీలు తర్ఫీదుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర స్థాయిలో 67 మంది వికలాంగ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిభను కనబరిచారని, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు.