handicape
-
దివ్యాంగులకు అండగా ఉంటాం : భూమన
-
‘చేయిలేకుంటేనేం.. కోహ్లికి బౌలింగ్ చేయాలనుంది’
సాక్షి, నాగ్‌పూర్: ‘చేయిలేకుంటేనేం.. చేవ ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయాలనుంది’ అని ఓ దివ్యాంగ క్రికెటర్ తన మనసులోని కోరికను వెల్లడించాడు. నాగ్‌పూర్‌కు చెందిన గురుదాస్ రౌత్ అనే దివ్యాంగ క్రికెటర్ పుట్టకతోనే ఎడమచేతి లేకుండా పుట్టాడు. ఎంతో మంది గురుదాస్ను దివ్యాంగుడివి, నీకేందుకు క్రికెట్ అంటూ నిరుత్సాహపరిచారు. కొందరైతే క్రికెట్ ఆడితే నీ కుడి చేతికూడా కోల్పోతావని హెచ్చరించారు. అయినా గురుదాస్ పట్టు వదలని విక్రమార్కుడులా క్రికెట్ ఆడుతూ మహారాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. చివరి వన్డేకు టీమిండియా నాగ్‌పూర్‌కు రావడంతో ఎప్పటి నుంచో ఉన్న కోహ్లికి బౌలింగ్ చేయాలనే తన కోరికను వెల్లడించాడు. గతంలో మాస్టర్ టెండూల్కర్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసిన ఈ ఒంటి చెతి క్రికెటర్.. డెవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టానని, పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ కూడా చేశానంటున్నాడు. అయితే తనకు క్రికెట్ ఆడేవకాశం వచ్చిన సందర్భాన్ని గురదాస్ ఓ జాతీయ చానెల్‌తో ప్రస్తావించారు. ‘ఒక రోజు నా స్నేహితునితో లోకల్ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నాను. అయితే బ్యాట్స్‌మెన్ కొట్టిన ఓ భారీ షాట్ నావైపు దూసుకొచ్చింది. అప్పుడు నా చేతిలో టీ కప్పు ఉంది. నేను వెంటనే టీ కప్పు పక్కకు పడేసి ఒంటి చేత్తో క్యాచ్ పట్టాను. దీంతో ఆజట్టుకు కోచ్‌గా ఉన్న ఉత్తమ్ మిశ్రా నన్ను చేరదీసి ఎలాంటి ఉపకరణాలు లేకుండా క్రికెట్ మెళుకువలు నేర్పారు.’ అని చెప్పుకొచ్చాడు ఈ దివ్యాంగ క్రికెటర్. అప్పటి నుంచి గురుదాస్ రౌత్ మహారాష్ట్ర జట్టు తరుపున రాణిస్తున్నాడు. నెట్స్‌లో కోహ్లికి బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని ఈ సందర్బంగా గురుదాస్ కోరాడు. -
పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న వృద్ధులు బేతంచెర్ల, న్యూస్‌లైన్: వయస్సు పైబడిన వృద్ధులు.. ఆసరా లేని వికలాంగులు.. తోడు దూరమైన వితంతువులు.. వీరందరికీ నెల నెలా వచ్చే పింఛన్ ఎంతో ఆసరానిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లా.. వీరికీ ఠంచన్‌గా పింఛన్ మొత్తం అందించి పెద్ద కొడుకుగా.. తోబుట్టువులా వారి హృదయాలను చూరగొన్నారు. ఆయన మరణానంతరం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియక.. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛన్ ఇస్తారో లేదో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అతి కష్టం మీద పొద్దున్నే కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా రాలేదని తెలిసి ఎండలో నిట్టూరుస్తూ ఇళ్లకు వె ళ్లిపోతున్నారు. దుడ్లు ఎప్పుడిస్తారోనని ఆశగా అడుగుతున్నారు. ఆ మహానేత జీవించి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కాదంటూ పలువురు పింఛన్‌దారులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవడం కనిపించింది. ఆ వైఎస్ దేవుడు లేకపోయినా.. ఆయన కొడుకు జగన్ అయినా వస్తే సక్రమంగా పింఛన్ దుడ్లు వస్తాయని మరింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎల్బీ స్టేడియం, టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు అర్హులైన అభ్యర్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో 31 డిసెంబరు 2012 నుంచి సాహస క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు వికలాంగులైన క్రీడాకారుల కూడా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్తకిగల అభ్యర్థులు తమ వివరాలతో ఈనెల 10వ తేదీలోగా ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయానికి తమ దరఖాస్తులను పంపించాలి. ఇతర వివరాలకు శాప్ పీఆర్ఓ (98666-94536)ను సంప్రదించవచ్చు -
ఓడిన వైకల్యం
ఓడిన వైకల్యం కొరుక్కుపేట : ఆత్మస్థైరం ముందు వైకల్యం ఓడింది అనడానికి శనివారం జరిగిన 13వ వార్షిక రాష్ట్ర స్థాయి వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌లో వికలాంగు క్రీడాకారుల ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది. వికలాంగులు వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాను చాటారు. తమిళనాడు వికలాంగుల సంక్షేమ చారిట బుల్ ట్రస్ట్, తమిళనాడు పారాఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా శని వారం చెన్నై, ఎస్‌డీఏటీ నెహ్రూ కాం ప్లెక్స్ వేదికగా వికలాంగుల స్పోర్ట్స్‌మీట్‌ను నిర్వహించారు. టీ.ఎన్.డి.ఎ.ఎఫ్.సి. ట్రస్ట్ అధ్యక్షులు జి.చిదంబరనాథన్ అధ్యక్షత వహించిన క్రీడా పోటీలను సాంఘీక సంక్షేమ విభాగం, వికలాంగుల సంక్షేమ మంత్రి పి.వలర్మతి, వికలాంగుల సంక్షేమ విభాగం రాష్ట్ర కమిషనర్ మణివాసన్ హాజరై ప్రారంభించా రు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది వికలాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కానరాదంటూ అన్న విధంగా పరుగుపందేలలోను, కబడ్డీలోను, షార్ట్ఫుట్లోను, ఇతర క్రీడలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిదంబరనాథన్ మాట్లాడుతూ ఈ పోటీలు తర్ఫీదుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర స్థాయిలో 67 మంది వికలాంగ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిభను కనబరిచారని, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు.