3000మీ. పరుగు విజేత ప్రణీత్‌ | praneeth wins 3000 meters meet | Sakshi
Sakshi News home page

3000మీ. పరుగు విజేత ప్రణీత్‌

Published Sat, Feb 18 2017 10:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

praneeth wins 3000 meters meet

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌ మీట్‌లో గృహవిజ్ఞాన కళాశాల విద్యార్థి సత్తా చాటాడు. రాజేంద్రనగర్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన 3000మీ. పరుగు ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. అదే కళాశాలకు చెందిన సాయి ప్రకాశ్‌ రెండో స్థానాన్ని దక్కించుకోగా... పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థి బాలకోటి మూడో స్థానాన్ని సాధించాడు. షాట్‌పుట్‌ విభాగంలో ఎస్‌ఆర్‌ నందా (అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల), కె. రవిబాబు, రాకేశ్‌ (పాలెం వ్యవసాయ కళాశాల) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు.

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

జావెలిన్‌ త్రో బాలికలు: 1. పి. బెన్లా, 2. వి. వినీత, 3. బి. మనీష
టెన్నికాయింట్‌ బాలికలు: 1. ఎ. ఉషారాణి– ఎస్‌. పూజిత, 2. ఎం. అరుణ– పి. అలేఖ్య
బాల్‌ బ్యాడ్మింటన్‌: 1. జగిత్యాల వ్యవసాయ కళాశాల, 2. హైదరాబాద్‌ గృహ విజ్ఞాన కళాశాల.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement