జెడ్పీ స్కూల్స్పోర్ట్స్ మీట్‌లో చైర్మన్‌కు దక్కని గౌరవం
జెడ్పీ స్కూల్స్పోర్ట్స్ మీట్‌లో చైర్మన్‌కు దక్కని గౌరవం
Published Thu, Dec 29 2016 9:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
- ఆహ్వాన పత్రికలోనూ మల్లెలకు లభించని చోటు
- విశిష్ట అతిథుల హోదాలో టీడీపీ నేతల పేర్లు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్పోర్ట్స్ మీట్‌లో సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌ను సంబంధిత అధికారులు విస్మరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ జే పుష్పావతి సొంతూరు నందవరంలో కర్నూలు డిస్ట్రిక్ట్ సెకండరీ స్కూల్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు జోనల్ గేమ్స్ ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనాలని భారీగా ఆహ్వాన పత్రికలను అందంగా ముద్రించారు. అందులో నేతలు, అధికారులు, అనధికారులు, టీడీపీ నాయకుల పేర్లను ముద్రించిన నిర్వాహకులు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌ను మరచిపోయారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పేరును ఇతర శాఖలకు సంబంధించిన కార్యక్రమాల్లో మరచిపోయారనుకుంటే సర్దుకుపోవచ్చు కానీ సాక్షాత్తు జిల్లా పరిషత్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పేరును ముంద్రించకపోవడం గమనార్హం. నిజంగా మరచిపోయారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా ఇలా చేశారా? అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement