సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్‌ఈ- ఐఎస్‌సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌లో ట్రిపుల్ జంప్ విభాగంలో హర్షిత, కార్తీక్‌లు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన పోటీల్లో ట్రిపుల్ జంప్ సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన హర్షిత పసిడిని దక్కించుకోగా... శ్రీరిన్ (సెయింట్ ఆన్స్), ఐశ్వర్య (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్) రజత కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర కేటగిరీలో కార్తీక్ సింగ్ (సుజాత స్కూల్), షణ్ముఖ్ సారుు తేజ, కౌశిక్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాలికల కేటగిరీలో రక్షిత (ఈఎస్‌ఆర్‌హెచ్‌ఎస్) తొలి స్థానంలో నిలవగా... మానస (ఈఎస్‌ఆర్‌హెచ్‌ఎస్), కస్తూరి (ఎన్‌ఏఎస్‌ఆర్) ద్వితీయ, తృతీయ స్థానాల్ని సంపాదించుకున్నారు.
ఇతర విభాగాల్లో విజేతల వివరాలు
సీనియర్ బాలికలు
జావెలిన్ త్రో: 1. శ్రీవియా గణపతి (సెయింట్ జోసెఫ్ హైస్కూల్), 2. ఎన్. నవ్యశ్రీ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. సుష్మా (జాన్సన్ గ్రామర్ స్కూల్).
వాకింగ్: 1. వర్ష చౌదరీ (షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాక్షి జైన్ (సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్), 3.ముస్కాన్ (ఎన్‌ఏఎస్‌ఆర్).
హైజంప్: 1. ఇషిత (ఎన్‌ఏఎస్‌ఆర్), 2. టి. ప్రవళిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. దివ్య (హెచ్‌పీఎస్).
200మీ. పరుగు: 1. జి. నిత్య (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. విన్నీ (సెరుుంట్ ఆన్‌స హైస్కూల్). 3. ఆత్రేయ చక్రవర్తి (గీతాంజలి)
డిస్కస్ త్రో: 1. రియా (టింపనీ స్కూల్), 2. శ్రీవియా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. క్రిసాల్డా (సెయింట్ ట్ ఆన్స్ స్కూల్).
సీనియర్ బాలురు
వాకింగ్: 1. రోషన్ (షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్), 2. జై (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. వర్ధన్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్).
1500మీ: 1. పవన్ తేజ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చంద్ర (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. అనిల్ (ఫ్యూచర్‌కిడ్‌స స్కూల్).
200మీ: 1. రూపేశ్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 2. మనీశ్ (సెయింట్ ట్ జార్జ్ స్కూల్), 3. దివాకర్ (హెచ్‌పీఎస్).
జూనియర్ బాలికలు
హైజంప్: 1. జి. దివ్య (సెయింట్ ఆన్స్), 2. విజయవాంగి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. కీర్తన (రమాదేవి పబ్లిక్ స్కూల్).
200మీ. : 1. నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. శ్రీలక్ష్మీ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్), 3. సి. లక్ష్య (సెయింట్ జోసెఫ్ స్కూల్).
జావెలిన్ త్రో: 1. జి. గీతాంజలి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. నందిని (సుజాత స్కూల్), 3. అనన్య (సుజాత స్కూల్).
3కి.మీ వాక్: 1. నవ్యశ్రీ (ఈఎస్‌ఆర్‌హెచ్‌ఎస్), 2. శ్రీవాసవి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. వైష్ణవి (షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్).