tripple jump
-
నిరాశ పరిచిన ఎల్డోజ్ పాల్.. తొమ్మిదో స్థానంలో నిలిచి..
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. చదవండి: వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్: నీరజ్ చోప్రా -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
విజేతలు హర్షిత, కార్తీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో ట్రిపుల్ జంప్ విభాగంలో హర్షిత, కార్తీక్‌లు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన పోటీల్లో ట్రిపుల్ జంప్ సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన హర్షిత పసిడిని దక్కించుకోగా... శ్రీరిన్ (సెయింట్ ఆన్స్), ఐశ్వర్య (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్) రజత కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర కేటగిరీలో కార్తీక్ సింగ్ (సుజాత స్కూల్), షణ్ముఖ్ సారుు తేజ, కౌశిక్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాలికల కేటగిరీలో రక్షిత (ఈఎస్ఆర్హెచ్ఎస్) తొలి స్థానంలో నిలవగా... మానస (ఈఎస్ఆర్హెచ్ఎస్), కస్తూరి (ఎన్ఏఎస్ఆర్) ద్వితీయ, తృతీయ స్థానాల్ని సంపాదించుకున్నారు. ఇతర విభాగాల్లో విజేతల వివరాలు సీనియర్ బాలికలు జావెలిన్ త్రో: 1. శ్రీవియా గణపతి (సెయింట్ జోసెఫ్ హైస్కూల్), 2. ఎన్. నవ్యశ్రీ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. సుష్మా (జాన్సన్ గ్రామర్ స్కూల్). వాకింగ్: 1. వర్ష చౌదరీ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాక్షి జైన్ (సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్), 3.ముస్కాన్ (ఎన్ఏఎస్ఆర్). హైజంప్: 1. ఇషిత (ఎన్ఏఎస్ఆర్), 2. టి. ప్రవళిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. దివ్య (హెచ్‌పీఎస్). 200మీ. పరుగు: 1. జి. నిత్య (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. విన్నీ (సెరుుంట్ ఆన్స హైస్కూల్). 3. ఆత్రేయ చక్రవర్తి (గీతాంజలి) డిస్కస్ త్రో: 1. రియా (టింపనీ స్కూల్), 2. శ్రీవియా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. క్రిసాల్డా (సెయింట్ ట్ ఆన్స్ స్కూల్). సీనియర్ బాలురు వాకింగ్: 1. రోషన్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. జై (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. వర్ధన్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్). 1500మీ: 1. పవన్ తేజ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చంద్ర (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. అనిల్ (ఫ్యూచర్కిడ్స స్కూల్). 200మీ: 1. రూపేశ్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 2. మనీశ్ (సెయింట్ ట్ జార్జ్ స్కూల్), 3. దివాకర్ (హెచ్‌పీఎస్). జూనియర్ బాలికలు హైజంప్: 1. జి. దివ్య (సెయింట్ ఆన్స్), 2. విజయవాంగి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. కీర్తన (రమాదేవి పబ్లిక్ స్కూల్). 200మీ. : 1. నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. శ్రీలక్ష్మీ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్), 3. సి. లక్ష్య (సెయింట్ జోసెఫ్ స్కూల్). జావెలిన్ త్రో: 1. జి. గీతాంజలి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. నందిని (సుజాత స్కూల్), 3. అనన్య (సుజాత స్కూల్). 3కి.మీ వాక్: 1. నవ్యశ్రీ (ఈఎస్ఆర్హెచ్ఎస్), 2. శ్రీవాసవి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. వైష్ణవి (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్).