ఓవరాల్ చాంప్ అభ్యాస స్కూల్ | abhyasa school wins sports meet title | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంప్ అభ్యాస స్కూల్

Published Thu, Aug 18 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

abhyasa school wins sports meet title

సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ సీనియర్ బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో బుధవారం వివిధ విభాగాల్లో స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. మొత్తం43 పాయింట్లతో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ చాంపియన్‌గా నిలవగా... 30 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది.

 

జూనియర్ బాలుర కేటగిరీలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (26 పాయింట్లు), గీతాంజలి స్కూల్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో రోనక్ జైశ్వాల్ (100మీ. ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ బ్రెస్ట్ స్ట్రోక్), అభ్యాస్ పట్వారీ (50మీ ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ. బటర్‌ఫ్లయ్) స్వర్ణాలు సాధించగా... సీనియర్ బాలుర కేటగిరీలో అదిత్య (50మీ. , 100మీ. బటర్‌ఫ్లయ్), ఆయుష్మాన్ దీక్షిత్ (50మీ., 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్) పసిడి పతకాలతో మెరిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement