abhyasa school
-
అభ్యాస స్కూల్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో అభ్యాస స్కూల్, షేర్వుడ్ పబ్లిక్ స్కూల్స్ ముందంజ వేశాయి. బషీర్‌బాగ్‌లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో అభ్యాస స్కూల్ 25-19, 25-17తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందగా... షేర్వుడ్ స్కూల్ 25-15, 25-17తో ఎన్ఏఎస్ఆర్ స్కూల్‌ను ఓడించింది. జూనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 27-25, 25-11, 15-10తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 25-13, 25-14తో రమాదేవి పబ్లిక్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ స్కూల్ 25-11, 25-11తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై, షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 25-23, 26-24తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై విజయం సాధించాయి. -
ఓవరాల్ చాంప్ అభ్యాస స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ సీనియర్ బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో బుధవారం వివిధ విభాగాల్లో స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. మొత్తం43 పాయింట్లతో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ చాంపియన్‌గా నిలవగా... 30 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. జూనియర్ బాలుర కేటగిరీలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ (26 పాయింట్లు), గీతాంజలి స్కూల్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో రోనక్ జైశ్వాల్ (100మీ. ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ బ్రెస్ట్ స్ట్రోక్), అభ్యాస్ పట్వారీ (50మీ ఫ్రీస్టయిల్, 50మీ., 100మీ. బటర్‌ఫ్లయ్) స్వర్ణాలు సాధించగా... సీనియర్ బాలుర కేటగిరీలో అదిత్య (50మీ. , 100మీ. బటర్‌ఫ్లయ్), ఆయుష్మాన్ దీక్షిత్ (50మీ., 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్) పసిడి పతకాలతో మెరిశారు.