గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బుధవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మొదలైన ఈ పోటీలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.వాణి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.
విద్యార్థుల వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో లేని ఎన్నో అంశాలను ఆటల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 పాఠశాలలకు చెందిన 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లయ బట్టు తదితరులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్స్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
Published Thu, Dec 19 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement