డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ | DKW students shine at sports meet | Sakshi
Sakshi News home page

డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ

Published Thu, Sep 29 2016 1:32 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ - Sakshi

డీకేడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ

 
నెల్లూరు (టౌన్‌):  గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో ఈ నెల 26,27 తేదీల్లో జరిగిన అంతర్‌ కళాశాల మహిళా క్రీడాపోటీల్లో నెల్లూరు డీకేడబ్ల్యూ మహిళా కళాశాల విద్యార్థినులు సత్తాచాటి పలు పతకాలు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ పీ శైలజ తెలిపారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులను బుధవారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినులు కోకో, బాస్కెట్‌బాల్, వాలీబాల్‌ విభాగాల్లో విన్నర్‌గా, కబడ్డీ, బాల్‌బాడ్మింటిన్, షటిల్‌ బాడ్మింటిన్‌ విభాగాల్లో రన్నర్‌గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపల్‌ ఉదయ్‌భాస్కర్, ఫిజికల్‌ డైరెక్టర్‌ రవీంద్రమ్మ, గేమ్స్‌కమిటీ సభ్యులు ఉమమహేశ్వరి, అధ్యాపకులు పద్మప్రియ, అపర్ణదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement