
జాతీయ క్రీడలు–2022లో ఓవరల్ పెర్ఫార్మెన్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ట్రోఫీలను అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, అధికారులు తదితరులు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్–2022 ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్ జయకేతనం ఎగురవేసింది. కోవిడ్‌తో వాయిదా పడిన మూడవ జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఈ నెల 17 నుంచి గురువారం (22వ తేదీ) వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4,328 మంది గిరిజన విద్యార్థులు పోటీ పడ్డారు.
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని లయోలా కాలేజీ, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, సీహెచ్‌కేఆర్ ఇండోర్ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్ వద్ద మొత్తం 22 రకాల క్రీడలు, ఆటల పోటీలను ఆరు రోజులపాటు నిర్వహించారు. 15 రకాల క్రీడల్లో రాష్ట్రానికి చెందిన బాలుర జట్లు 5 విభాగాల్లోను, బాలికల జట్లు 8 విభాగాల్లోను జయకేతనం ఎగురవేసి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించాయి.
మొత్తం 7 క్రీడల్లో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ అత్యధిక పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చివరివరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఇచ్చిన తెలంగాణ రన్నర్‌గా నిలిచింది. కాగా, 7 ఆటల విభాగాల్లో అండర్–19లో బాలురు హ్యాండ్‌బాల్, వాలీబాల్‌లోను, బాలికల జట్టు ఖోఖో విభాగంలోను చాంపియన్‌గా నిలవడం గమనార్హం. మొత్తానికి రాష్ట్రం నుంచి బాలుర కంటే బాలికలే బాగా రాణించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment