నివాసాలపై కూలిన విమానం | China Navy Plane Hits Buildings, No Casualties Reported | Sakshi
Sakshi News home page

నివాసాలపై కూలిన విమానం

Published Thu, May 12 2016 12:40 PM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM

నివాసాలపై కూలిన విమానం - Sakshi

నివాసాలపై కూలిన విమానం

బీజింగ్: చైనా నౌకా దళానికి చెందిన విమానం ఒకటి నివాస సముదాయాలపై కూలింది. అదృష్టవశాత్తు పైలెట్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, ఇతర నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బుధవారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చైనా రక్షణ శాఖ తెలిపింది.

జిజియాంగ్ ప్రావిన్స్ లోని తైజో అనే ప్రాంతంలో గల భారీ నివాస సముదాయాలపై ఇది కూలినట్లు వివరించారు. అయితే కూలింది ఏరకమైన విమానమో ఇంకా గుర్తించలేదు. సాధారణంగా చైనా నేవీ పాతకాలం నాటి జే-7, జే-8 విమానాలు ఉపయోగిస్తోంది. రష్యాకు చెందిన సుఖోయ్-27 విమానాలు కూడా తన ఆపరేషన్లకు ఉపయోగిస్తోంది. కాగా, ఈ విమానం శిక్షణలో ఉన్నప్పుడు కూలిపోయిందని, ఇటీవల ఇలాంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చైనా డిఫెన్స్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement