
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 155 మహిళా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.15.50 కోట్లు కేటాయించారు. కరీంనగర్, వరంగల్ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఈ మహిళా భవనాలను నిర్మించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment