* ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పోస్టు
* త్వరలో భర్తీ అయ్యే అవకాశాలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రోడ్లు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ (పర్యవేక్షక ఇంజినీర్) పోస్టు కోసం ఆ శాఖలోని కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రహదారుల అభివ ృద్ధిపై ప్రభుత్వం ద ృష్టి సారించి.. జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి రోడ్లను అద్దంలా నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన ఈ పోస్టు కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉన్నతాధికారి జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో అధికారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ గతంలో ఎస్‌ఈగా పనిచేసిన జి.హంసారెడ్డి ఆరు నెలల క్రితం ఏసీబీకి చిక్కారు. పనుల అనుభవం (ఎక్సిపీరియెన్స్ సర్టిఫికేట్) మంజూరు కోసం ఓ కాంట్రాక్టరు వద్ద రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏప్రిల్ 4న అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి రూ.కోట్లలో ఆస్తులు కూడగట్టారనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కరీంనగర్ జిల్లా ఎస్‌ఈగా పనిచేస్తున్న చందూలాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
తాజాగా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన ఈ పోస్టును భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీగా ఉన్న చందూలాల్‌కే ఇక్కడికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు చందూలాల్ ఆసక్తి చూపుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణం, మరమ్మతుకు మోక్షం కలగనుంది.
ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికారులు జిల్లాలోని పలు రహదారుల అభివ ృద్ధి పనులకు అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అలాగే మన ఊరు.. మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పలు రోడ్ల అభివ ృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు.
‘పర్యవేక్షణ’ కోసం ప్రయత్నాలు
Published Sat, Nov 1 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement
Advertisement