ఏరియల్ వ్యూలో తీసిన ఫొటో ఇది. ఇందులో తాబేళ్లు వరుసగా కొలువుదీరినట్లు కనిపిస్తోంది కదూ! ఇవి తాబేళ్లు కావు, హోటల్ భవనాలు. థాయ్‌లాండ్‌లోని హువాహిన్ ప్రాంతంలో ఉన్న ఖావో తావో రిజర్వాయర్‌లో ఇలా తాబేలు ఆకారంలో నీటిలో తేలియాడే హోటల్ భవంతులను నిర్మించారు. (క్లిక్: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!)
పూర్తిగా వెదురుతోను, స్థానికంగా దొరికే ప్రకృతిసిద్ధమైన నిర్మాణ పదార్థాలతో వీటిని నిర్మించారు. ఈ హోటల్ భవంతుల్లో బస చేయడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. డెర్సిన్ స్టూడియో కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ సారావుత్ జాన్సెంగ్ ఆరామ్ ఎంతో శ్రమించి, ఈ కూర్మహర్మ్యాలకు రూపకల్పన చేశారు. (చదవండి: ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment