న్యూఢిల్లీ: జీఎస్టీ ఫైలింగ్‌కు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. జులైలో కొనుగోళ్లు, ఇన్పుట్-అవుట్పుట్ లావాదేవీల కోసం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ రిటర్న్ దాఖలు సోమవారం మరోనెలపాటు పొడిగిస్తూ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. అక్టోబర్28న బెంగళూరులో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. జీఎస్‌టీ -2 రిటర్న్‌కు నవంబర్ 30 అని జీఎస్‌టీఆర్-2 దాఖలుకు చివరి తేదీ డిసెంబర్ 11 అని ట్విట్టర్‌లో వెల్లడించింది.
అక్టోబర్ 31 నుంచి గడువు కొనుగోలు రిటర్న్ లేదా జీఎస్‌టీఆర్-2 గడువును నవంబర్ 30వరకు, ఇన్పుట్-అవుట్పుట్ లావాదేవీల జీఎస్‌టీఆర్ 3 దాఖలును డిసెంబర్ 11 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ట్వీట్ చేసింది.
గతంలో ఆడిట్ చేసిన ఆదాయం పన్ను రాబడిల సమర్పణకు జీఎస్‌టీ-2 దాఖలు చేసిన గడువు ముగియడంతో కొంతమంది పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తెచ్చిందని క్లియర్ టాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్చిత్ గుప్తా తెలిపారు. ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభ్యత దానిపై ఆధారపడి ఉండటం వలన ఇది అత్యంత ముఖ్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment