వచ్చేనెల 4 - 13 వరకు కొత్తగూడెంలో ర్యాలీ
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వచ్చేనెల 4 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఆర్మీ ర్యాలీకి మంగళవారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 20 నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19న ముగియనుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు. మొత్తం ఆరు విభాగాల్లో నియామకాలు చేయనున్నారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్స్‌మన్ కేటగిరీల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
‘ఆర్మీ’ దరఖాస్తులకు రేపు తుది గడువు
Published Mon, Jan 18 2016 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement