ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు
Published Mon, Oct 17 2016 8:06 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈపాస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రంతో ఆన్‌లైన్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సమస్యలు ఎదురైతే వారి పరిధిలోని సహాయకుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఏలూరు డివిజన్‌లో 9963141266, జంగారెడ్డిగూడెం 7674932132, కొవ్వూరు 9989321976, నరసాపురం 9704782803 డివిజన్ల నంబర్లలో సంప్రదించాలని, ఇదే చివరి అవకాశమని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Advertisement